Sunday, April 28, 2024

కళ్యాణలక్ష్మీ పేదలకు వరం

- Advertisement -
- Advertisement -

నల్లగొండ:కళ్యాణ లక్ష్మీ పేదలకు వరం అని దేవరకొండ శాసనసభ్యులు,బిఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చందంపేట మండలానికి చెందిన 61మందికి రూ.61లక్షలు, నేరడుగొమ్ము మండలానికి చెందిన 35మందికి రూ.35లక్షలు కళ్యాణ లక్ష్మీ, షాదిముబారక్ చెక్కులను, చీరలను ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కళ్యాణ లక్ష్మీ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. మహిళలను ఆదుకునేందుకు ప్ర భుత్వం కృషి చేస్తుంది అని ఆయన అన్నారు. ప్రభుత్వ పథకాల ద్వార అ త్యధికంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలు ఎక్కువ లబ్దిపొందడం జరుగుతుందని ఆయన అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారు సంక్షేమ పథకాల పితామహుడని ఆయన కొనియాడారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసా ఇస్తున్నాయని అన్నారు.

రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడ మే సీఎం కేసీఆర్ ముఖ్య లక్ష్యమని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృ ద్ధి, సంక్షేమ పథకాలను ప్ర వేశపెడుతూ దేశానికే మార్గదర్శిగా మారారని అన్నారు. పేదల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని, దీనిలో భాగంగా ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు పేద ప్రజలకు ఎంతో ఆసరాగా నిలుస్తున్నాయని అన్నారు. ప్రభుత్వ ఆస్పతుల్లో ప్రసవం, కేసీఆర్ కిట్ మొ దలుకొని ఆడపిల్ల పెండ్లి చేసేవరకు ఇంట్లో పెద్దన్నగా ఎంతో మంది పేద కుటుంబాలకు అండగా కేసీఆర్ నిలిచారని అన్నారు.ఈ పథకాలతో రాష్ట్రవ్యాప్తంగా వేల కుటుంబాల్లో వెలుగులు నింపిన ఘనత కేసీఆర్కే దక్కుతున్నదని అన్నారు.

కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ పథకాలు అమల్లోకి వచ్చిన తర్వాత బాల్య వివాహాల సంఖ్య పూర్తిగా తగ్గిపోయిందని ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నేనావత్ బుజ్జిలచ్చిరాం,సర్పంచుల ఫోరం అధ్యక్షుడు దొ ందేటి మల్లా రెడ్డి, బిఆర్‌ఎస్ మ ండల అధ్యక్షుడు ముత్యాల సర్వయ్య, పిఏసిఎస్ చైర్మన్ ముక్కమల్ల బా లయ్య,రైతు బంధు అధ్యక్షుడు బోయపల్లి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీపీ ఏర్పుల గోవింద్ యాదవ్, గోసుల అనంతగిరి, కేతవత్ లక్ష్మణ్ నాయక్, పల్స వెంకటయ్య, జర్పుల లోక్య నాయక్, రమావత్ మోహన్ కృష్ణ, బైరెడ్డి కొండల్ రెడ్డి, వేముల రాజు, కేతవత్ రవీందర్, గంగిడి కొండల్ రెడ్డి, దూడ బావోజి,బోదికూర మహాలక్ష్మయ్య, ముత్యాల రవి, కృష్ణ, వంకునవత్ రవి నాయక్,రమేష్, పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News