Tuesday, April 30, 2024

‘జై శ్రీరామ్’ జెండా తొలగించిన కమల్‌నాథ్

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ నుంచి బిజెపికి ఫిరాయింపుపై వదంతులు
తన ఢిల్లీ నివాసంపై జెండా తీసివేసిన నేత
కమల్‌నాథ కుమారుడూ బిజెపిలో చేరతారనే వార్తలు

న్యూఢిల్లీ : మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి బిజెపిలో చేరతారానే వదంతులు సాగుతున్న నేపథ్యంలో ఆయన తన నివాసంపై ఎగురవేసిన ‘జై శ్రీరామ్’ జెండాను తొలగించారు. ఢిల్లీలోని కమల్ నాథ్ నివాసంపై జెండా ఎగురుతూ ఆదివారం కనిపించింది. కమల్‌నాథ్, ఆయన కుమారుడు నకుల్ నాథ్ కాంగ్రెస్‌ను వీడనున్నారనే వదంతులు కొన్ని వారాలుగా వినవస్తున్నాయి.

కమల్ నాథ్ ఢిల్లీకి వచ్చినప్పుడు, ఆయన కుమారుడు, మధ్య ప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపి నకుల్ నాథ్ సోషల్ మీడియాలో తన బయోలో పార్టీ పేరును తొలగించడంతో ఆ వదంతులకు శనివారం మరింత ఊపు వచ్చింది. కమల్ నాథ్ దేశ రాజధానిలో బిజెపి అధిష్ఠానంతో భేటీ కానున్నారనే ఊహాగానాలూ సాగుతున్నాయి. అభిజ్ఞ వర్గాల కథనం ప్రకారం, నిరుడు మధ్య ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి చేతిలో కాంగ్రెస్ ఘోర పరాజయం దరిమిలా పిసిసి చీఫ్ పదవి నుంచి తనను తొలగించడంతో కమల్ నాథ్ ఆగ్రహం చెందారు.

అయితే, కమల్ నాథ్ పార్టీకి గుడ్‌బై చెప్పనున్నారన్న వార్తలను కాంగ్రెస్ ఖండించింది. ఆయనకు పార్టీతో సుదీర్ఘ అనుబంధం ఉందని పేర్కొన్న కాంగ్రెస్ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ మధ్య ప్రదేశ్ ఛింద్వారాలో ఆయన తరఫున ప్రచారం సాగిస్తూ ఆయనను తన ‘మూడవ కుమారుని’గా అభివర్ణించారని గు ర్తు చేసింది. కమల్ నాథ్ తొమ్మిది సార్లు ఎంపిగా ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. కమల్‌నాథ్ వారసుడు జితు పట్వారీ ఆయన బిజెపిలో చేరడం లేదనిఆదివారం స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News