Wednesday, May 8, 2024

‘వకీల్ సాబ్’ నుంచి మెలోడీ సాంగ్ విడుదల..

- Advertisement -
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వకీల్ సాబ్’. బాలీవుడ్ మూవీ ‘పింక్’కు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో పవన్ సరసన శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన సాంగ్స్, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాలోని ‘కంటిపాప’ అనే మెలోడీ సాంగ్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ సాంగ్ ను పవన్, శ్రుతి హాసన్ మధ్య చిత్రీకరించారు. రామజోగయ్య శాస్త్రీ రచన అందించగా, థమన్ సంగీత సారథ్యంలో అర్మిన్ మాలిక్, దీపు అలపించిన ఈ సాంగ్ ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ మూవీలో నివేదా థామస్, అంజలి, అనన్యలు కీలక పాత్రలో నటిస్తున్నారు.దిల్ రాజు నిర్మిస్తున్నీ ఈ సినిమా ఏప్రిల్ 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

KANTIPAPA lyrical Song released from ‘Vakeel Saab’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News