Sunday, May 5, 2024

కరోనా నియంత్రణకు కెసిఆర్ అద్భుతంగా పని చేస్తున్నారు: హరీష్

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: కరోనా నియంత్రణకు సిఎం కెసిఆర్ చర్యలు తీసుకుంటున్నారని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. అమీన్‌పూర్ కరోనా ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి హరీష్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పేదలను ఆదుకోవడంతో కెసిఆర్ దేశానికే ఆదర్శంగా నిలిచారని పొగిడారు. వలస కూలీలు, కార్మికుల కోసం 12 కిలోల బియ్యం, రూ.500 ఇస్తున్నారని, తెలంగాణలో దాదాపు నాలుగు లక్షల మంది వలస కూలీలకు సాయం చేశామని హరీష్ వెల్లడించారు. అందరూ ఇండ్లోనే ఉండాలని, జిల్లాలో టెలి మెడిసిన్ సేవలు ప్రారంభించామని, ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భారత దేశంలో కరోనా రోగులు సంఖ్య 9373కు చేరుకోగా 334 మంది మృతి చెందారు. తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 531కి చేరుకోగా 16 మంది చనిపోయారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ 18,58,699 మందికి సోకగా 1,14,698 మంది మరణించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News