Tuesday, April 30, 2024

కెసిఆర్‌ను మించిన హిందువు లేరు

- Advertisement -
- Advertisement -

KCR is biggest Hindu in Telangana

మన తెలంగాణ/హైదరాబాద్:  ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ప్రవేశపెట్టిన ప్రతి పథకంలో ఒక సామాజిక కోణం ఉంటుందని టిఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె. కేశవరావు అ న్నారు. అందుకే మన రాష్ట్రంలో అమలవుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ పథకా లు దేశంలో మరెక్కడా లేవన్నారు. అన్ని రంగాల్లో దేశానికి తెలంగాణ రాష్ట్రం ఒక మార్గదర్శకంగా నిలుస్తోందన్నారు. సర్వహిత ప్రయోజనం కోసం టిఆర్‌ఎస్ ప్ర భుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. అయినప్పటికీ కొన్ని పార్టీలు దురద్ధేశపూర్వకంగా సిఎం కెసిఆర్‌పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల్లో మ తాన్ని రెచ్చగొట్టేందుకు యత్నించడం సి గ్గుచేటని ఆయన మండిపడ్డారు. భారతదేశంలో సిఎం కెసిఆర్‌ను మించిన హిం దువు మరొకరు లేరన్నారు.

ఆయన చేసినన్ని యాగాలు, చేసిన పూజలు, కొలిచి న నోములు ఎవరూ చేయలేదన్నారు. అందరిని సమానంగా చూడాలని హిం దూత్వం కోరుకుంటున్నదని…అదే సిఎ ం కెసిఆర్ ఆచరించి చూపుతున్నారని కే శవరావు పేర్కొన్నారు. శనివారం తెలంగాణ రాష్ట్ర భవన్‌లో మంత్రి కొప్పుల ఈ శ్వర్‌తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జి హెచ్‌ఎంసిలో ఓట్ల కోసం బిజెపి పడరాని పాట్లు పడుతోందన్నారు. సిఎం కెసిఆర్‌పై బుదర చల్లి రాజకీయంగా ప్రయో జం పొందాలని ఆశిస్తోందన్నారు. అయి తే ప్రజలు అంత అమాయకులు కారన్నారు. వారు చెప్పే మాటలు విని గ్రేటర్ ప్రజలు మోసపోరన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో దుబ్బారలో గెలిచినంత మాత్రం జిహెచ్‌ఎంసిలో కూడా విజయం సాధిస్తామని బిజెపి నాయకులు పగటి కళలు కంటున్నారని విమర్శించారు. బిజెపి, కాంగ్రెస్ నాయకులు ఎన్ని అబద్దాలు అడి ప్రచారం చేసిన గ్రేటర్‌లో విజయం సాధించేది గులాబీ పార్టీయేనని ఆయన పేర్కొన్నారు. సిఎం కెసిఆర్ పటిష్టమైన వ్యూహం, యువనేత, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ధృడ సంకల్పం ముందు వారు రాజకీయాలు దిగదుడుపేనని అన్నారు. కెటిఆర్ దమ్మున్న నేత అని అన్నారు. హైదరాబాద్ అభివృద్ధిపై మున్సిపల్ శాఖ మంత్రిగా ఆయనది ప్రత్యేక ముద్ర ఉందని అన్నారు. తాను కాంగ్రెస్ పార్టీ లో వివిధ హోదాల్లో పని చేశానని, సామాజిక న్యాయం కోసం ఆ పార్టీ లో ప్రయత్నించానని అన్నారు. కానీ అది అక్కడ సాధ్యపడలేదన్నారు. అందుకే ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి టిఆర్‌ఎస్‌లో చేరానని అన్నారు. తాను ఆశించిన విధంగా సామాజిక న్యాయం ఇక్కడ విజయవంతంగా అమలు జరుగుతోందన్నారు. సామాజిక న్యాయాన్ని జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో కూడా పాటించిందన్నారు. కష్టాల్లో ఉన్న వరద భాదితులకు ఆదుకునేందుకు ఒక్క క్షణం ఆలోచించకుండా రూ.550 కోట్లు నిధులు విడుదల చేసారన్నారు. వరదల్లో నష్టపోయిన వారికి డబ్బులు పంచడం పాపమా? అని ఈ సందర్భంగా కేశవరావు ప్రశ్నించారు.

నగరంలో అశాంతి సృష్టించేందుకు బిజెపి కుట్ర

ప్రశాంతంగా ఉన్న నగరంలో అశాంతిని సృష్టించేందుకు బిజెపి యత్నిస్తోందని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో ప్రజల్లో చిచ్చుపెట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నది టిఆర్‌ఎస్ ప్రభుత్వం…ముఖ్యమంత్రి కెసిఆర్ అన్న విషయాన్ని బిజెపి నేతలు గుర్తుకు పెట్టుకోవాలన్నారు. వారి ఆటలు ఇక్కడ సాగవన్నారు. బిజెపి ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నంత వరకు ఫలించవన్నారు. దళితులకు గొప్ప పాలన అందిస్తాం అన్న బిజెపి మాటలు…. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎలా ఉందో ప్రజలు ఒకసారి గమనించాన్నారు. వరద బాధితులకు రూ. 10వేల పంపిణీని అడ్డుకున్నది కమలనాధులేనని అన్నారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో సహృదయంతో ముందుకు వచ్చి ఆదుకుంటుంటే దానిని కూడా అడ్డుపుల్లలు వేయడం ఎంత వరకు సమంజసమన్నారు. వరద బాధితులకు సాయం విషయంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేంద్రం నుంచి ఎందుకు ఒక్క రూపాయి వరదలకు తేలేకపోయారు? అని ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ నిలదీశారు. ప్రజలను ప్రలోభాలకు గురిచేసే విధంగా బండి సంజయ్ అరాచక వాగ్ధానాలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. ఈ దేశంలో బిజెపి నాయకులే దేశ భక్తులు అన్న చందంగా మాట్లాడుతున్నారన్నారు. వారికి తప్ప ఇంకా ఎవరికి దేశ భక్తి ఉండదా? అని ప్రశ్నించారు.రాముడు నడయాడిన భద్రాచలంకు బిజెపి ఏమిచేసిందో బండి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సిఎం కెసిఆర్‌ను అక్భర్‌కు వారసుడు అనే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. హిందుత్వంకు బిజెపి వక్ర భాష్యం చెబుతోందని ఆయన ధ్వజమెత్తారు.

కమలనాధుల మాటల తీరు పూటకు గతి లేదు..

మాటకు మతి లేదు అన్నట్టు ఉన్నాయన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను బిజెపి నిర్వీర్యం చేస్తోందన్నారు. నిజామాబాద్ ఎంపి ధర్మపురి అరవింద్ గెలిచివెంటనే పసుపు బోర్డ్ తెస్తా అని మాట తప్పారన్నారు. .రాజకీయాల్లో నిబద్ధత లేని వ్యక్తి అరవింద్ అని మండిపడ్డారు. మతతత్వం కలిగిన పార్టీ కాబట్టే దేశ ప్రజలు అనేక సంవత్సరాలు బిజెపిని దూరం పెట్టారన్నారు. ఆ పార్టీ నినాదమే అభివృద్ధి నిరోధక విధానమని విమర్శించారు. అలాంచి పార్టీకి జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో తగు విధంగా ప్రజలు బుద్ధిచెబుతారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News