Monday, May 13, 2024

కాళోజీ అంటే కెసిఆర్‌కు అపార గౌరవం: శ్రీనివాస్ గౌడ్

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: కాళోజీ అంటే సిఎం కెసిఆర్‌కు అపార గౌరవం ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రవీంద్రభారతిలో ప్రజాకవి కాళోజీ నారాయణ రావు 107వ జయంతి ఉత్సవాలను మంత్రులు ఘనంగా ప్రారంభించారు. కాళోజీ పురస్కారాన్ని పెన్నా శివరామకృష్ణకు మంత్రులు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. భావితరాలకు కాళోజీ గురించి తెలిపేందుకు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నామని, ప్రత్యేక తెలంగాణలో ఎందరో గొప్ప వ్యక్తులు ఘనంగా స్మరించుకున్నామని, కాళోజీ జీవితం ప్రజలకే అంకితమైందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, ఎంఎల్‌ఎ సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్, ఎంఎల్‌సి గోరేటి వెంకన్న పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News