Saturday, April 27, 2024

సిఎం కెసిఆర్ రాష్ట్రఅభివృద్ధిని సవాల్‌గా స్వీకరించారు: ప్రొఫెసర్ హనుమంతరావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు రాష్ట్ర అభివృద్ధినిసవాలుగా స్వీకరించి రాష్ట్రాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేశారని సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ ప్రొఫెసర్ సి.హెచ్ హనుమంతరావు అన్నారు. రాష్ట్ర అవతరణదినోత్సవాల సందర్భంగా నగరంలో సదస్సు జరిగింది. ఈ సందర్భంగా రాష్ట ఆర్థిక, ప్రణాళకాశాఖ రూపొందించిన స్టేట్ ఎకానమి గ్రంథాన్ని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో పాల్గొన్నహనుమంతరావు కీలకోపన్యాసం చేశారు.

రాష్ట్రఏర్పాటుతో విద్యుత్ సమస్యలు పరిష్కారం కావడమే కాకుండా ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు కూడా అందుతున్నాయన్నారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతల అంశంలో ఆయన తీసుకున్న ప్రత్యేకచొరవ కారణంగా నేరాల సంఖ్య కూడా తగ్గిందని నేషనల్ క్రైమ్స్ రికార్డు బ్యూరో ( ఎన్‌ఆర్‌సిఆర్‌బి) నివేదిక తెలిపినట్లు చెప్పారు. పోరుగు రాష్ట్రాలతో పోలిస్తే 2015 2021 కాలంలో తెలంగాణలో వామపక్ష తీవ్రవాదం కూడా తగ్గిందన్నారు. రాష్ట్ర ఏర్పాటుతో తెలంగాణ మావోయిస్టులకు, మత చాంధవాసులకు కంచుకోటగా మారుతుందన్న శ్రీకృష్ణకమిటి భయాందోళనలకు ఎటువంటి ఆధారంలేదని ఎన్‌ఆర్‌సిఆర్‌బి నివేదిక వెల్లడించిందన్నారు.

సోషల్ ఆడిట్ నివేదికలో కూడా తెలంగాణ రాష్ట్ర జిడిపి జాతీయ సగటు అభివృద్ధి రేటు కంటే అధిక స్థాయిలో పెరుగుతోందని తద్వారా తెలంగాణ వార్షిక ఆదాయం ( రూ.3.17 లక్షలు ) జాతీయ సగటు తలసరి వార్షిక ఆదాయం ( రూ.1.71 లక్షలు) కంటే అధికంగా ఉందన్నారు. వ్యవసాయం, అనుభంద రంగాల్లో వృద్ధిరేటుతో పాటు ఇతర ప్రయోజనాల కారణంగా జిఎస్‌డిపి అధివృద్ది సాధ్యమైందన్నారు. గోదావరి జలాలను ఎత్తిపోసేందుకు ప్రఖ్యాత కాళేశ్వరం బహుళ దశల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుతో సహా సరికొత్త భారీ, మధ్యతరహాల నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి పెట్టుబడబడి పెట్టం కూడా అభివృద్ధికి కారణమైనట్లు వెల్లడించారు.

వ్యసాయానికి ఉచిత విద్యుత్, ప్రతి ఇంటికి తాగు నీరు అందించేందుకు ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ, రైతుబంధు,దళిత బంధు పథకాలు కూడా రాష్ట్ర అభివృద్ధికి సహకరించినట్లు వెల్లడించారు. నీటి వనరులు అధికంగా ఉండటంతో తెలంగాణలో రైతుల ఆత్మహత్య సంఖ్య కూడా క్రమంగా తగ్గిందని స్టేట్ క్రైమ్ రికార్డుబ్యూరో గణాంకాలు తెలిపాయన్నారు. నివేదిక ప్రకారం 2015లో తెలంగాణలో 1358 రైతులు ఆత్మహత్యలు ఉండగా 2021 నాటికి 352కు తగ్గినట్లు చెప్పారు. తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధి గణనీయంగా పెరిగిందన్నారు. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్టు అప్రూవల్, సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ ( టిఎస్ ఐ పాస్), ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లను సులభతరం చేయడంతో భారీ పరిశ్రమల ఏర్పాటకు అవకాశం ఏర్పడిందన్నారు. పరిశ్రమల ఏర్పాటుతో 73 వేల మందికి ఉపాధి లభించినట్లు చెప్పారు. రాష్ట్రంలో ఉపాధి కల్పించడంలో సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల దేశవ్యాప్తంగా వ్యవసాయం తర్వాత రెండో స్థానంలో ఉన్నట్లు చెప్పారు.

2015 అనంతరం 19 వేల ఎంఎస్‌ఎమ్‌ఈల కార్యాలకలాపాల ద్వారా 3.5 లక్షల మందికి ఉపాధిలభించందన్నారు. తెలంగాణ స్టేట్‌ప్రోగ్రామ్ ఫర్ ర్యాపిడ్ ఇంక్యుబేషన్, దళిత, ఎంటర్‌ప్రెన్యూనర్స్ పలు ప్రోత్సాహకాలు, సబ్సిడీలు అందించడంతో ఎస్సీ,ఎస్టీ మహిళల నుంచి పారిశ్రామిక వేత్తల ప్రాధాన్యత పెరిగిందన్నారు. గత ఏడేళ్ళలో ఐటి ఎగుమతుల్లో ప్రతి సంవత్సరం 15.7 శాతం వృద్ది నమోదైనట్లు తెలపారు.ఈ ఏడేళ్ళ కాలంలో ఐటి రంగంలో మొత్తం ఉపాధి 7.7 లక్షలకు చేరుకున్నట్లు తెలిపారు. మాతాశిశు మరణాల రేటు 2014లో 92 నుంచి 2020 నాటికి 43కు పడిపోయిందన్నారు. శిశుమరణాల రేటు గ్రామీణ ప్రాంతాల్లో 2014 లో 39 నుంచి 2020లో 21కు పట్టణ ప్రాంతాల్లో 24 నుంచి 17కి పడిపోయిందన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News