Monday, April 29, 2024

ఎన్నికల నిష్పక్ష నిర్వహణ ఇక డౌటే

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రధాని మోడీ ఎన్నికల ప్రక్రియను తన గుప్పిట్లోకి తీసుకువచ్చేందుకే ఈ ఎన్నికల సంఘం నియామకాల బిల్లు తీసుకువచ్చారని ఢిల్లీ సిఎం, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. కేంద్రం పరిధిలోకి సంఘం అధికారాలు ధారాదత్తం అయితే ఇక దీనితో ఎన్నికల్లో స్వచ్ఛత సక్రమంపై ప్రభావం పడుతుందని తెలిపారు. సుప్రీంకోర్టు ఇంతకు ముందటి తీర్పును కూడా ప్రధాని బేఖాతరు చేయడం ప్రజాస్వామ్యానికి ముప్పు అవుతుందని హెచ్చరించారు. సుప్రీంకోర్టు ఆలోచనలను ,తీర్పును ప్రధాని పట్టించుకోకపోతే అది పలు రకాలుగా దుష్ప్రభావాలకు దారితీస్తుందని గురువారం కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు.

‘ప్రధాని మోడీకి రుచించని సుప్రీకోర్టు తీర్పు వెలువడితే దీనిపై ఆయన సహించరు. ఈ విషయాన్ని తాను పలుసార్లు చెప్పాను. దేశానికి అత్యున్నత న్యాయస్థానం తీర్పును బేఖాతరు చేయడం సబబేనా? నిష్పక్షపాత రీతిలో త్రిసభ్య కమిటీ ఏర్పాటుకు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. అయితే దీనిని కాదనే రీతిలో ఇప్పుడు ప్రధాని వ్యవహరిస్తున్నారు? ప్రధాని తనకు ఇష్టులైన వారికి ఎన్నికల సంఘంలో కీలక పదవులు కట్టబెడితే ఇక దీనితో ఎన్నికలలో నిష్పక్షపాత ధోరణి ఎక్కడుంటుంది’ అని కేజ్రీవాల్ ప్రశ్నించారు.

ఇద్దరు బిజెపి వారు , ఒక్కరు కాంగ్రెస్‌కు చెందిన వారు కమిటీలో ఉన్నట్లు అయితే ఇక సహజంగానే సిఇసి, ఇసిల ఎంపికలు బిజెపికి విశ్వసనీయలుతోనే జరుగుతాయని కేజ్రీవాల్ తెలిపారు. ఇదే జరిగితే ఇక ఎన్నికల్లో న్యాయం మాట సంగతి ఏమిటీ? న్యాయం జరగాల్సి ఉందని ముందుకు వచ్చిన సుప్రీంకోర్టు వెలువరించిన న్యాయం సంగతి ఏమిటని కేజ్రీవాల్ ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News