Sunday, April 28, 2024

కేరళను ఆర్థిక సంక్షోభంలో నెట్టేసిన మోడీ సర్కార్

- Advertisement -
- Advertisement -

ఢిల్లీలో పినరయి సారథ్యంలో లెఫ్ట్ ఫ్రంట్ నిరసన

న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవహారాలలో దక్షిణాది రాష్ట్రాల పట్ల మోడీ ప్రభుత్వం నిర్లక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సారథ్యంలో అధికార ఎల్‌డిఎఫ్ గురువారం దేశ రాజధానిలో నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఎల్‌డిఎఫ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ లెఫ్ట్ ఫ్రంట్ నాయకులతోపాటు సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గురువారం ఉదయం చలిగాలులలను సైతం లెక్కచేయకుండా జంతర్ మంతర్ నుంచి కేరళ హౌస్ వరకు పాదయాత్ర చేశారు.

కేరళను ఆర్థికంగా సంక్షోభంలోకి నెట్టేసిన కేంద్ర ప్రభుత్వ నిర్లక్షపూరిత ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ లెఫ్ట్ ఫ్రంట్ నాయకులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్రాల సమాఖ్యగా నిర్దేశించిన ప్రజాస్వామ్యం క్రమక్రమంగా రాష్ట్రాలపై అప్రజాస్వామిక సమాఖ్యగా మారుతోందని, దీని ప్రభావం దేశమంతటా ముఖ్యంగా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలలో స్పష్టంగా కనపడుతోందని లెఫ్ట్ ఫ్రంట్ నాయకులు తెలిపారు. ఈ పోకడలకు వ్యతిరేకంగా నిరసన తెలియచేసి భారత దేశ ఫెడరల్ వ్యవస్థను పరిరక్షించేందుకే తామంతా కలసికట్టుగా ఇక్కడకు వచ్చామని వారు తెలిపారు.

తమ పోరాటం రాష్ట్రాల పట్ల సమ న్యాయానికి దారి తీయగలదని, కేంద్ర, రాష్ట్ర సంబంధాలలో సమతుల్యతను సాధించడానికి దోహదపడగలదన్న ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు. జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసన ప్రదర్శనలో జమ్మూ కశ్మీరు నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా, తమిళనాడు మంత్రి పళనివేల్ త్యాగరాజన్, ఢిలీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా పాల్గొన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ఈ నిరసనకు సంఘీభావం ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News