Wednesday, May 1, 2024

ఐఎఎస్ అధికారికి కేరళ హైకోర్టు వినూత్న శిక్ష

- Advertisement -
- Advertisement -

Kerala-HC

తిరువనంతపురం: కేరళలోని ఒక ఐఎఎస్ అధికారికి హైకోర్టు వినూత్న శిక్ష విధించింది. వంద మొక్కలు నాటాలంటూ కేరళ హైకోర్టు ఆ అధికారిని ఆదేశించింది. అమ్మకం పన్నులో రాయితీలు ఇవ్వాలని కోరుతూ ఒక ప్రైవేటు సంస్థ చేసిన విజ్ఞప్తిపై రెండు దశాబ్దాలు దాటినా నిర్ణయం తీసుకోనందుకు రాష్ట్ర పరిశ్రమల శాఖ డైరెక్టర్ కె బిజూకు హైకోర్టు శుక్రవారం శిక్ష విధించింది.

కేరళ జల వనరుల శాఖ మంత్రి కె కృష్ణన్‌కుట్టి కుమారుడు బిజూ. గడచిన రెండు దశాబ్దాలుగా ఈ కేసులో నిర్ణయం తీసుకోనందుకు గతంలో పరిశ్రమల శాఖ డైరెక్టర్లుగా పనిచేసిన అధికారులందరినీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమిత్ రావల్ బాధ్యులుగా పరిగణించారు. కాగా, ఈ పదవిలో ప్రస్తుతం బిజూ కొనసాగుతున్నందున ఆయన కేరళ అటవీ శాఖ ఎంపిక చేసిన స్థలంలో వంద మొక్కలు నాటాలని న్యాయమూర్తి ఆదేశించారు. రసాయనిక రంగంలోని ఒక ప్రైవేట్ సంస్థ అమ్మకం పన్ను రాయితీలు కోరుతూ 2001లో రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు పత్రం సమర్పించింది. అయితే దీన్ని పరిశ్రమల శాఖ తిరస్కరించడంతో ఆ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది.

Kerala HC orders IAS officer to plant 100 saplings, the court has directed Industries department Director K Biju to plant saplings as punishment for not taking decision on a private firms appeal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News