Saturday, April 27, 2024

ఐఎఎస్‌, ఐపిఎస్‌లకు సిఎం రేవంత్‌ రెడ్డి వార్నింగ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. రోజుకు 18 గంటలు పని చేయండి.. పని చేయడం కుదరదనుకుంటే బాధ్యతల నుంచి తప్పుకోండన్నారు. పనిచేయడం ఇష్టం లేని వాళ్లు సిఎస్‌, డిజిపికి చెప్పి తప్పుకోవాలని సూచించారు. బాధ్యత తీసుకుంటే పూర్తి స్థాయిలో నిర్వర్తించాలి సిఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. 6 గ్యారెంటీలు అమలు కావాలంటే ప్రజాప్రతినిధులు, అధికారులు జోడెద్దుల్లా పనిచేయాలని ఆదేశించారు.

సచివాలయంలో ఏ నిర్ణయం తీసుకున్నా క్షేత్రస్థాయిలో అమలు చేసే బాధ్యత ప్రజాప్రతినిధులు, కలెక్టర్లదేనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో డా.బీ.ఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, సీ.పీలు, ఎస్.పిల సమావేశానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, సీ.ఎస్ శాంతి కుమారి, డీజీపీ రవీ గుప్తా, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News