Tuesday, May 7, 2024

ఇటలీలో ‘ఖిలాడి’ సందడి

- Advertisement -
- Advertisement -

‘Khiladi’ shooting in Italy

 

రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఖిలాడి’. రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రానికి సత్యనారాయణ కోనేరు నిర్మాత. డా.జయంతీలాల్ గడ సమర్పణలో ఏ స్టూడియోస్‌తో కలిసి బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. హవీష్ ప్రొడక్షన్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని మే 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఇటలీలోని అందమైన లొకేషన్లలో జరుగుతోంది. అక్కడ రవితేజ సహా ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి రామ్, లక్ష్మణ్, అన్బు, అరివు ఫైట్ మాస్టర్లుగా చేస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News