Friday, April 26, 2024

బాలుడిని కిడ్నాప్ చేసిన నిందితుడి అరెస్టు

- Advertisement -
- Advertisement -

Kidnapped Child rescued by Abids Police from Maharastra

మహారాష్ట్రలో పట్టుకున్న పోలీసులు
బాలుడిని విక్రయించేందుకు కిడ్నాప్ చేసిన నిందితుడు
వివరాలు వెల్లడించిన నగర సిపి అంజనీకుమార్

హైదరాబాద్: ఈ నెల 9వ తేదీన కిడ్నాప్‌కు గురైన బాలుడి కథ సుఖాంతం అయింది. బాలుడిని కిడ్నాప్ చేసిన నిందితుడిని అబిడ్స్ పోలీసులు అరెస్టు చేశారు. నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కర్నాటక రాష్ట్రం, బీదర్‌కు చెందిన ఎం. శివకుమార్ కూలీ పనిచేస్తున్నాడు. ఇతడికి భార్య ముగ్గురు పిల్లలకు ఉన్నారు. బతుకు దెరువుకోసం నగరానికి వచ్చాడు. ఇతడి చిన్న కుమారుడు రుద్రమణి(3) ఈ నెల కిడ్నాప్‌కు గురయ్యాడు. తల్లిదండ్రులు అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేశారు. మహారాష్ట్ర, వాసిం జిల్లా, మాలేగావ్ తాలుక,అమన్ వాడి గ్రామానికి చెందిన శ్యాం భీమ్ రావు సోలంకి నగరంలో స్టోన్ వర్కర్‌గా పనిచేస్తున్నాడు. బాధితులు బతుకు దెరువు కోసం భార్య అంబిక, పిల్లలు నందిని, భవానీ, రుద్రమణితో కలిసి ఈ నెల 7వ తేదీన నగరానికి వచ్చాడు. ఇక్కడ ఇల్లు లేకపోవడంతో ఫుట్‌పాత్‌పైనే ఉంటున్నారు.

రాత్రి సమయంలో నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్‌లో నిద్రిస్తున్నారు. జడ్చర్లలో కెనాల్ పనిచేసేందుకు గ్రామస్తులతో కలిసి వచ్చిన శ్యాం భీం రావు సోలంకి పనిచేయలేక ఇంటికి వెళ్ధామని నాంపల్లి రైల్వే స్టేషన్‌కు వచ్చాడు. అప్పుడే బాధితులతో కలిసి ఫుట్‌పాత్‌పై ఉంటున్నాడు. అప్పుడే బాలుడినిక కిడ్నాప్ చేయాలని ప్లాన్ వేసి తన పేరు భోగిరామ్ అని వారికి చెప్పాడు. తాను వారితో కలిసి పనిచేస్తానని చెప్పాడు. ఈ నెల 7వ తేదీన వారి వద్ద ఉన్న మొబైల్ ఫోన్, రూ.3,700 నగదు చోరీకి గురయ్యాయి. దీంతో వారు తమ మకాంను గాంధీ భవన్ మెట్రో రైల్వే స్టేషన్‌కు మార్చారు. ఈ నెల 8వ తేదీన పిల్లలు, భోగిరామ్‌తో ఆడుకుంటుండగా శివకుమార్ పనికోసం శేజాన్ హోటల్‌కు పనికోసం వెళ్లాడు. అదే సమయంలో అతడి భార్య పిల్లలకు తాగేనీరు తెచ్చేందుకు వెళ్లింది.

ఇదే అదునుగా భావించిన నిందితుడు బాలుడు రుద్రమణికి ఛాక్లెట్ కొనిస్తానని చెప్పి తీసుకుని వెళ్లాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన శివకుమార్ భార్య కుమారుడి కోసం వెతికినినా కన్పించలేదు. కోఠి, నాంపల్లిలో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సిసిటివి ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేసి నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడు బాబును విక్రయించేందుకు తన సొంత గ్రామానికి తీసుకుని వెళ్లాడు. సిసిటివి ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు నిందితుడిని సొంత గ్రామంలో అదుపులోకి తీసుకుని బాలుడిని రక్షించారు. నారాయణగూడ అడిషనల్ ఇన్స్‌స్పెక్టర్ రవికుమార్, పిసిలు రవికుమార్, సాయిలు, ఇన్స్‌స్పెక్టర్ గోపి, పిసి సతీష్ లాల్ యాదవ్, రాఘవేంద్ర రావు తదితరులు పట్టుకున్నారు. సమావేశంలో జాయింట్ సిపి విశ్వప్రసాద్, ఎసిపి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News