Saturday, April 27, 2024

విద్యార్థుల ఇష్టాలను తెలుసుకుంటే సమతుల్యత మార్గం వైపు నడిపించవచ్చు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్:  విద్యార్థుల ఇష్టాయిష్టాలు, ప్రాధాన్యతలను తెలుసుకోవటం ద్వారా వారిని సమతుల్య మార్గంలో తీర్చిదిద్దవచ్చని ప్రముఖ మోటివేషవల్ వక్త, సినీ నటుడు కె.వి. ప్రదీప్ పేర్కొన్నారు. వారి వారి దృక్కోణం నుంచి విద్యార్థులను ఉత్తేజపరచటం ద్వారా ఉన్నత శిఖరాలు అధిరోహించేలా ప్రేరేపించాలని సూచించారు. ఆదివారం ఉస్మానియా యూనివర్శిటీ సిఎఫ్‌ఆర్‌డిలో విజయవంతంగా రీసెర్చ్ బేస్డ్ పెడగోగికల్ వర్క్‌షాప్ ముగిసింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన విద్యార్థులకు పలు సూచనలు సలహాలు చేసి మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. విద్యార్థులను చురుకైన, మెరుగైన అబ్యాసకులుగా తీర్చి దిద్ధేందుకు అవసరమైన అబ్యాస పద్దతులను పాటించాలని ఓయూ సైకాలజీ విభాగం బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఛైర్‌పర్సన్ డాక్టర్ పి స్వాతి అభిప్రాయపడ్డారు.

ఇందుకోసం బోధనా వ్యూహాల్లో భాగంగా భావోద్వేగ మేధస్సు ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. అదే విధంగా పరిశోధకుడు, గ్రూప్ లీడర్ అయిన డాక్టర్ కె రాజేందర్ రావు ప్రసంగిస్తూ గ్రామంలోని పాఠశాల రోజుల నుండి తన జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అక్కడ అభ్యాసంలో ఆచరణాత్మక విధానాలు తనకి బలమైన పునాదిని నిర్మించడంలో సహాయపడ్డాయని అభిప్రాయపడ్డారు. ఉపాధ్యాయుల కోసం ఇటువంటి బోధనా వర్క్‌షాప్‌ల ప్రాముఖ్యతను ఆయన వివరించారు. ఈ కార్యశాలను ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు. ఈసందర్భంగా యూనివర్సిటీ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ బి వీరయ్య మాట్లాడుతూ పరిశోధన ఆధారిత బోధనలో ఉపాధ్యాయుల అంకితభావం ప్రాముఖ్యతను వివరించారు. ఇది సైన్స్‌ను కెరీర్‌గా ఎంచుకోవడంలో విద్యార్థులను ప్రేరేపిస్తుందన్నారు. ఓయూ మైక్రోబయాలజీ విభాగ ప్రొఫెసర్, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్‌పర్సన్ , వర్క్‌షాప్ కో ఆర్డినేటర్ డాక్టర్ హమీదా బీ అధ్యక్షత వహించారు. సైన్స్ సబ్జెక్టుకే పరిమితం కాకుండా ఉపాధ్యాయులందరికీ ఇటువంటి వర్క్‌షాప్‌ల ప్రాముఖ్యతను తెలపాలని అన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యాయులు తమ తరగతి గది బోధనా వ్యూహాలను మెరుగుపరచడం ద్వారా విద్యార్థులకు శిక్షణ ఇవ్వడంలో నైపుణ్యం సాధించాలని ఆమె వ్యాఖ్యానించారు. తెలంగాణలోని కళాశాలల నుంచి పలువురు అధ్యాపకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News