Monday, May 6, 2024

నేడు బిసి బిల్లుపై అఖిలపక్ష భేటి : జాజుల

- Advertisement -
- Advertisement -

దేశవ్యాప్త ఉద్యమ కార్యాచరణ వెల్లడి

మన తెలంగాణ / హైదరాబాద్ : బిసి బిల్లుపై అఖిలపక్ష పార్టీలు, బిసి కుల సంఘాల సమావేశం నిర్వహిస్తున్నట్లు బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మహిళా బిల్లులో బిసి మహిళలకు సబ్ కోట కల్పించాలనే ప్రధాన డిమాండ్ పై కూడ చర్చించనున్నామన్నారు. సోమవారం హైదరాబాద్, లక్డికాపూల్ లోని సెంట్రల్ కోర్ట్ హోటల్లో జరిగే ఈ సమావేశంలో ఆఖిలపక్ష పార్టీలు,సామాజిక ఉద్యమ సంస్థలతో విస్తృత సమావేశాన్ని నిర్వహిస్తున్నామన్నారు.

ఈ ఆఖిలపక్ష సమావేశంలో రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు, సామాజిక ఉద్యమ సంస్థలు, బిసి కుల సంఘాలు, మహిళ సంఘాలతో పాల్గొంటాయని జాజుల తెలిపారు. ఈ సమావేశానికి దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీ సంఘాల అధ్యక్షులను, 136 కులాల రాష్ట్ర అధ్యక్షులను ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో మహిళా బిల్లులో బిసి మహిళలకు సబ్ కోట సాధించడానికి దేశవ్యాప్తంగా మండల తరహాలో మరో ఉద్యమాన్ని తీసుకురావడానికి, దేశంలోని 29 రాష్ట్రాల్లో బహిరంగ సభలు సమావేశాలు ఉద్యమ కార్యాచరణ రూపొందించి,దేశ వ్యాప్త బిసిల రాజకీయ కార్యాచరణ ప్రకటించనున్నట్లు ఆయన తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News