Wednesday, May 1, 2024

మహిళా క్రికెటర్ కుటుంబానికి కోహ్లి సాయం

- Advertisement -
- Advertisement -

Virat Kohli gets male ODI cricketer of Wisden decade

ముంబై : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరోసారి తన ఔదార్యం చాటుకున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్న భారత మహిళా క్రికెటర్ స్రవంతి నాయుడు తల్లి చికిత్స కోసం కోహ్లి రూ.6.77 లక్షలను విరాళంగా అందజేశాడు. స్రవంతి తల్లిదండ్రులకు కరోనా సోకింది. అప్పటికే వీరి చికిత్స కోసం స్రవంతి కుటుంబ సభ్యులు దాదాపు 16 లక్షల రూపాయల వరకు ఖర్చే చేశారు. అయినప్పటికీ ఆమె తల్లి ఆరోగ్యం కుదుట పడలేదు. తన తల్లి ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారడంతో స్రవంతి ఆర్థిక సహాయం కోసం బిసిసిఐ, హైదరాబాద్ క్రికెట్ సంఘాలను అభ్యర్థించింది. కాగా ఇదే సమయంలో బిసిసిఐ సౌత్ జోన్ మాజీ కన్వీనర్, స్రవంతి సోదరి ఎన్.విధ్య ట్విటర్ వేదికగా సాయం చేయాలని కోహ్లిని కోరింది. దీనికి వెంటనే స్పందించిన కోహ్లి రూ.6.77 లక్షల సాయాన్ని స్రవంతి కుటుంబానికి అందించాడు. ఇక కష్ట సమయంలో తమకు అండగా నిలిచిన కోహ్లికి స్రవంతి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News