Sunday, April 28, 2024

శునకాలకు పసందైన బిర్యానీ

- Advertisement -
- Advertisement -

Nagpur man feeding 190 stray dogs

ముంబై: మహారాష్ట్ర నాగ్ పూర్ కు చెందిన 58 ఏళ్ల రంజీత్ నాథ్ గత 11 సంవత్సరాలుగా వీధి కుక్కల ఆకలి తీరుస్తున్నారు. ప్రతిరోజూ దక్షిణ నాగ్‌పూర్ వీధుల్లో సగటున 150-170 శునకాలకు బిర్యానీ చేసి పెడుతున్నారు. బుధ,శుక్ర, ఆదివారాల్లో రంజిత్ సొంతంగా పసందైన చికెన్ బిర్యానీ తయారు చేస్తారు. బండిపై వీధుల్లో తిరుగుతూ కుక్కలకు పెడతారు. అవి తన పిల్లల్లాంటివని, బతికున్నంత కాలం ఈ పని వదలనని చెబుతున్నారు. కుక్కలకు కడుపు నింపితే చాలా సంతోషంగా ఉందని రంజీత్ నాథ్ పేర్కొన్నారు. అతను మొదట్లో వాటికి బిస్కెట్లు ఇవ్వడం ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభించాడు. గత 2.5 సంవత్సరాల నుండి చికెన్, మటన్ మిక్స్ బిర్యానీ చేసి పెడుతున్నాడు. ఆయన చేసే ఈ పనిపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News