Sunday, April 28, 2024

విరాట్ కోహ్లీ తప్పుకుంటాడేమో: మాజీ స్పిన్నర్‌

- Advertisement -
- Advertisement -

Kohli will step down from captaincy says Monty Panesar

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అత్యుత్తమ ఆటగాడే అయిన అతని సారథ్యంలో టీమిండియా సరిగ్గా ఆడలేకపోతుందనిఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కోహ్లీ నేతృత్వంలో భారత్ నాలుగు టెస్టుల్లో ఓటమి చవిచూడగా అదే సమయంలో అజింక్య రహానే ఆస్ట్రేలియా పర్యటనలోజట్టును విజయ పథంలో నడిపించాడు. ఈ క్రమంలోనే పనేసర్ కోహ్లి నాయకత్వంపై తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆల్ టైం అత్యుత్తమ బ్యాట్స్ మెన్ లలో విరాట్ కోహ్లీ ఒకడని, అతని నేతృత్వంలో టీమిండియా సరిగా ఆడటం లేదని చెప్పాడు. తర్వాతి మ్యాచ్ లోనూ భారత జట్టు ఓటమి పాలైతే విరాట్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాడేమోనని పనేసర్ తెలిపాడు. టీమిండియా కోహ్లీ సారథ్యంలో చివరి సారి 2019లో నవంబర్ లో బంగ్లాదేశ్ పై గెలుపొందింది. గతేడాది ఫిబ్రవరిలో న్యూజిలాండ్ తో జరిగిన రెండు టెస్టులో భారత్ ఓటమిపాలైంది. ఇక డిసెంబర్ లో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో ఘోర పరాభవం చవిచూసింది. ఇంగ్లాండ్-భారత్ నాలుగు టెస్టు మ్యాచ్ లో భాగంగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో భారత్ ఘోరంగా ఓడిపోయింది. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వెల్లవెత్తుతున్నాయి.

Kohli will step down from captaincy says Monty Panesar

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News