Saturday, May 4, 2024

బిఆర్‌ఎస్‌కు డిపాజిట్లు దక్కవు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/నల్గొండ బ్యూరో:పార్లమెంట్ ఎన్నికలలో ప్రజలను మాయ చేసేందుకు యత్నిస్తూ మాజీ సిఎం కెసిఆర్ బస్సు యాత్ర చే స్తానంటుండని, బస్సు యాత్ర కాదు కదా.. మోకాళ్ళ యాత్ర చే సినా భువనగిరి, నల్గొండలో ఆ పార్టీకి డిపాజిట్ కూడా దక్కదని రో డ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అ న్నారు. నల్గొండలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవా రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. లిక్క ర్ కేసులో అరెస్టు అయిన బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవితకు బెయిల్ దొరకదని, వీళ్లు చేసిన అవినీతి, అక్రమాలకు అతి త్వరలో కెసిఆర్, కెటిఆర్ కూడా జైలుకెళ్లడం ఖాయమన్నారు. నల్గొండ, భువనగిరిలో బిఆర్‌ఎస్ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు కనీసం సర్పంచ్‌లుగా కూడా పనికిరారని వ్యాఖ్యానించారు. కెసిఆర్‌కి దమ్ముంటే మెదక్‌లో తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలని సవాల్ విసిరారు. తాను పిలిస్తే బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చేందుకు 25 మంది ఎంఎల్‌ఎలు సిద్ధంగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో 15 స్థానాలలో తమ పార్టీ గెలుపొందుతుందని అన్నారు. రాష్ట్రంలో బిఆర్‌ఎస్‌కు ఒక్క ఎంపి సీటు కూడా రాదన్నారు. బిజెపి, బిఆర్‌ఎస్‌లకు కాలం చెల్లిందని, పదేళ్లు అధికారంలో ఉండి అభివృద్ధి చేయలేని వారు ఇప్పుడేం అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. మాయమాటలు చెబుతూ ప్రజలను మభ్యపెడుతూ ఓట్లు వేయించుకునే కుట్ర చేస్తున్నారని, ఆ రెండు పార్టీల కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. మతాల మధ్య చిచ్చుపెట్టి బిజెపి రాజకీయం చేస్తోందని ఆరోపించారు. నల్గొండ జిల్లాను బ్రష్టుపట్టించిన సంస్కారహీనుడు జగదీష్ రెడ్డి గురించి ఇక మాట్లాడనని, ఆయన గురించి మాట్లాడి తన స్థాయిని దిగజార్చుకోనన్నారు.కెసిఆర్ ఉమ్మడి నల్గొండ జిల్లాను సర్వనాశనం చేశారని, జిల్లా అభివృద్ధిని ఏనాడూ పట్టించుకోలేదని మండిపడ్డారు. కెసిఆర్ వల్లనే నేడు జిల్లాకు కరువు వచ్చిందని, నీటి పంపకాల విషయంలో ఆంధ్రా సిఎం జగన్, కెసిఆర్ లాలూచీ పడ్డారన్నారు. దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతోందని, రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. సిఎం రేవంత్ రెడ్డితో తామంతా రాష్ట్ర అభివృద్ధి కోసం టీం వర్క్‌గా పని చేస్తున్నామన్నారు.

నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి బుధవారం నామినేషన్ వేయనున్నారని, నామినేషన్ కార్యక్రమానికి నియోజకవర్గంలోని మహిళలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో తనను గెలిపించిన విధంగానే పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ మెజార్టీతో తమ పార్టీ నల్లగొండ అభ్యర్థి రఘువీర్ రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. మీడియా సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్ నాయక్, పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News