Tuesday, May 7, 2024

ప్రధాని మోడీకి కోమటిరెడ్డి లేఖ

- Advertisement -
- Advertisement -
Komatireddy Venkat Reddy Letter To PM Modi
నూతనంగా మంజూరైన ఎన్.హెచ్‌కు నెంబర్, నిధులు కేటాయించాలని వినతి

హైదరాబాద్: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు జంక్షన్ గౌరెల్లి నుంచి కొత్తగూడెం ఎన్ హెచ్ 30 వరకు నూతనంగా మంజూరైన జాతీయ రహదారికి ఎన్‌హెచ్ నెంబర్ కేటాయించడంతో పాటు డిపిఆర్‌కు అనుమతి ఇవ్వాలంటూ ప్రధానమంత్రి మోడీకి భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురువారం లేఖ రాశారు. ఈ లేఖను ప్రధానమంత్రి కార్యాలయంలో సమర్పించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. నూతనంగా మంజూరైన ఈ జాతీయరహదారి వల్ల హైదరాబాద్‌వైజాగ్ పోర్టు, హైదరాబాద్-‌ఛత్తీస్‌గఢ్ మధ్య దాదాపు 100 కిలోమీటర్ల ప్రయాణ దూరం తగ్గుతుందని తెలిపారు.

ఈ ప్రాజెక్టుకు డిపిఆర్‌లను ఆహ్వానించగా ఇప్పటివరకు ఈ డిపిఆర్‌లకు అనుమతి ఇవ్వలేదని వివరించారు. దాదాపు 100 కిలోమీటర్లకు పైగా భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం గుండా ఈ రహదారి వెళుతుందన్నారు. ఈ రోడ్డు గిరిజన ప్రాంతాల నుంచి. రెండు గిరిజన ప్రాంతాలు మహబూబాబాద్, కొత్తగూడెం గుండా వెళుతుందని వెల్లడించారు. ఈ రోడ్డు పూర్తయితే గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఈ రహదారికి వెంటనే ఎన్.హెచ్ నెంబర్ కేటాయించి.. డిపిఆర్‌లకు అనుమతులు ఇచ్చి..నిధులు కేటాయించేలా సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేయాలని ప్రధాని నరేంద్ర మోడీని లేఖలో కోరారు. కేంద్ర రోడ్డు రవాణా శాఖ సెక్రటరీ ఎ.గిరిధర్‌కు సైతం ఈ లేఖను అందజేశారు.

Komatireddy Venkat Reddy Letter To PM Modi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News