Friday, May 3, 2024

ప్రభుత్వ ఉద్యోగం వదులుకున్నా

- Advertisement -
- Advertisement -

Krunal Pandya

 

కృనాల్ పాండ్య

ముంబై: క్రికెటర్‌గా ఎదగాలనే లక్ష్యంతో తనకు వచ్చిన ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం వదులుకున్నానని టీమిండియా ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్య పేర్కొన్నాడు. జాతీయ స్థాయి క్రికెట్‌లో ప్రవేశించక ముందే తనకు ప్రభుత్వ ఉద్యోగం వరించిందన్నాడు. ఓ ప్రభుత్వ సంస్థలో క్లర్క్ ఉద్యోగం తనకు లభించిందన్నాడు. అప్పుడూ కుటుంబ సభ్యులందరూ తనను ఆ ఉద్యోగం చేయడమే మంచిదని సలహా ఇచ్చారన్నాడు. క్రికెట్‌ను వదిలి ఉద్యోగం చేసుకోవాలని ఒత్తిడి తెచ్చారన్నాడు. అయితే తాను మాత్రం తాను నమ్ముకున్నదానివైపే మొగ్గు చూపానని కృనాల్ వివరించాడు. ప్రభుత్వం ఉద్యోగాన్ని వదిలి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ కోసం జరిగిన ట్రయల్స్‌కు హాజరయ్యానని తెలిపాడు. అప్పుడూ తనకు బరోడా జట్టు తరఫున ఆడే అవకాశం దొరికిందన్నాడు. అప్పటికే సోదరుడు హార్దిక్ పాండ్య ముంబై జట్టులో చోటు సంపాదించాడన్నాడు. ఇక అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బ్యాట్‌తో బంతితో రాణించానన్నాడు. తన ప్రతిభను గుర్తించి ముంబై ఇండియన్స్ యాజమాన్యం తమ జట్టులోకి తీసుకుందన్నాడు. దీంతో తన దశ తిరిగి పోయిందన్నాడు. మెరుగైన ఆటతో టీమిండియాలో చోటు సంపాదించే స్థాయికి ఎదిగానని కృనాల్ పేర్కొన్నాడు.

 

Krunal Pandya quits government job for cricket
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News