Sunday, April 28, 2024

బహుపరాక్!

- Advertisement -
- Advertisement -

తెలంగాణ వాదులమంటూ కొత్త ముసుగు వేసుకొస్తున్న కెవిపి, షర్మిల, కిరణ్‌కుమార్ రెడ్డి

పదేళ్లు కష్టపడి సాధించిన ప్రగతిని ఈ తెలంగాణ వ్యతిరేక శక్తుల చేతుల్లో పెడదామా? తెలంగాణ
సమాజం అప్రమత్తంగా ఉండాలి ఎవరెన్ని కుట్రలు చేసినా కెసిఆర్ హ్యాట్రిక్ పక్కా ఎన్ని
ప్రయత్నాలు చేసినా విపక్షాలది రెండో స్థానమే మా సిఎం అభ్యర్థి కెసిఆర్.. ప్రతిపక్షాలు తమ అభ్యర్థి
పేరు చెప్పగలవా? రేవంత్ తెలంగాణవాది కాదు.. తెలంగాణకు పట్టిన వ్యాధి నేషన్.. వన్
ఎలక్షన్ ఓ జిమ్మిక్కు ఆంధ్రప్రదేశ్ పరిణామాలపై మాట్లాడడానికి ఏమీలేదు మీడియాతో చిట్‌చాట్‌లో
బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 90 స్థానాకులపైగా గెలుస్తాం. నుంచి వస్తున్న ఫీడ్‌బ్యాక్ ఆధారంగా కెసిఆర్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రజలు భావిస్తున్నారు. పదేండ్లలో ప్రభుత్వం అందించిన
పథకాలు, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలే అద్భుతంగా వివరిస్తున్నారు. ఈ విషయంలో ప్రజలకు చాలా స్పష్టత ఉంది. ప్రతిపక్షాలే అయోమయంలో ఉన్నాయి. కెసిఆర్, బిఆర్‌ఎస్ పార్టీయే తెలంగాణకు శ్రీరామరక్ష.

కెవిపి రామచంద్రరావు, షర్మిలతెలంగాణ వాదులమని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వారు కాంగ్రెస్‌ను గెలిపిస్తారంట? తెలంగాణను వ్యతిరేకించిన కెవిపి, షర్మిల రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తేస్తామని అంటున్నారు. ఇంతటి దుస్థితి కాంగ్రెస్ పార్టీకి పట్టింది. తెలంగాణ ఎమ్మెల్యే పదవి వదిలిపెట్టలేని కిషన్ రెడ్డి, తెలంగాణ ప్రజలపై రైఫిల్ తీసుకువెళ్లిన రేవంత్ రెడ్డి తెలంగాణ ముసుగులో వచ్చారు. తెలంగాణ వ్యతిరేకతను నరనరాన నింపుకున్న కిరణ్ కుమార్ రెడ్డి, కెవిపి రామచందర్రావు, షర్మిల వంటి వారంతా ఏకమవుతున్నారు. పైకి కనబడేది కిషన్‌రెడ్డి.. ఆడించేది కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్‌లో కనబడేది రేవంత్ రెడ్డి.. ఆడించేది కెవిపి రామచంద్రరావు. తెలంగాణ ఉద్యమాన్ని కొనుగోలు చేసే ప్రయత్నం చేసి ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నం చేసిన కెవిపి రామచంద్రరావు ఈరోజు తెలంగాణ వాదిగా చెప్పుకోవడం మన కర్మ.

మన బహురూప వేషగాళ్లు వస్తున్నారు.. తెలంగాణ సమా జం అంతా అప్రమత్తంగా ఉండాలని బిఆర్‌ఎస్ వ ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు హెచ్చరించారు. తెలంగాణ వ్యతిరేకులు కెవిపి రామచంద్రరావు, షర్మిల, కిరణ్‌కుమార్ రెడ్డిలు బ హురూప వేషగాళ్ల రూపంలో వస్తున్నారని మంత్రి కె టిఆర్ అన్నారు. పదేళ్లు సాధించిన అభివృద్ధిని, తెలంగాణ వ్యతిరేకుల చేతులు పెడతామా? ఈ విషయా న్ని ప్రజలు తెలుసుకోవాలని కెటిఆర్ సూచించారు. రానున్న ఎన్నికల్లో ప్రతిపక్షాలది రెండో స్థానమేనని, కెసిఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని కెటిఆర్ ధీమా వ్యక్తం చేశారు.

జాతీ య పార్టీలు ఢిల్లీ బానిస పార్టీలని ఆయన వ్యాఖ్యానించారు. ఆత్మగౌరవమున్న తెలంగాణ ప్రజలు బానిసత్వ పార్టీలను అంగీకరించరని ఆయన తెలిపారు. తెలంగాణలో బిఆర్‌ఎస్ పార్టీకి మరింత సానుకూల వాతావరణ ఉందని ఆయన స్పష్టం చేశారు.ప్రగతి భవన్‌లో మంగళవారం కెటిఆర్ మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ సిట్టింగ్‌లకు సీట్లు ఇవ్వకుంటే మా దగ్గరకు వస్తారని ప్రతిపక్షాలు భావించాయని తెలిపా రు. తాను నిర్మించిన నాయకత్వం, పార్టీ నాయకులపైన తనకున్న నమ్మకం మేరకే కెసిఆర్ సిట్టింగ్‌లకే సీట్లు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. మూడునెలల ముందే 115 స్థానా ల్లో విజయవంతంగా సిట్టింగ్‌లను ప్రకటించిన ఘనత మా సిఎంకే దక్కుతుందన్నారు. 65 ఏండ్లలో ప్రతిపక్షాలు పెట్టిన మెడికల్ కా లేజీలు కేవలం రెండేనని, కేంద్రం ఒక్క మెడికల్ కాలే జీ ఇవ్వలేదని, నర్సింగ్ కాలేజీ ఇవ్వలేదని, నవోద య పాఠశాల ఇవ్వలేదని, ఇతర రాష్ట్రాల్లో ఉన్న అస్థిరత, నాయకత్వ లోపం తెలంగాణలో లేదని కెటిఆర్ పేర్కొన్నారు.

మా ముఖ్యమంత్రి అభ్యర్థి కెసిఆర్ అని, ప్రతిపక్షాల ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో వారికే తెలియదని కెటిఆర్ ఎద్దేవా చేశారు. ఢిల్లీ నుంచి వచ్చే సీల్డ్ కవర్లు, వారికి అందించే మూటలు మాదిరిగా ప్ర తిపక్షాల పరిస్థితి ఉందని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రులను మార్చడానికి మత కల్లోలాలను రేపి మరణహోమం సృష్టించి, మనుషులను చంపించిన నీచ చరిత్ర కాంగ్రెస్ పార్టీదని ఆయన ఆరోపించారు.

తమ పార్టీ నాయకులపైనే దాడులు చేయించిన ఘనత కాంగ్రెస్‌దని, తెలుగువారి గౌరవం పివి నరసింహారావుపైనే చెప్పులు విసిరిన ఘనత ఆ పార్టీ నాయకులదేనని ఆయన తెలిపారు. ఢిల్లీ బానిస పార్టీలు జాతీయ పార్టీలని, ఆత్మగౌరవం అధికంగా ఉన్న తెలంగాణ ప్రజలు ఈ బానిసత్వ పార్టీలను అంగీకరించరని, ఢిల్లీ బానిసలు కావాలో? తెలంగాణ బిడ్డ కావాలో తెలంగాణ ప్రజలు తేల్చుకోవాలని ఆయన సూచించారు.

రేవంత్ తెలంగాణకు పట్టిన వ్యాధి
రేవంత్ రెడ్డి తెలంగాణ వాది కాదు, తెలంగాణకు పట్టిన వ్యాధి అని కెటిఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఒకరైనా తెలంగాణ ఉద్యమంలో ఉన్నారా? ఒక్కరన్న రాజీనామా చేశారా? కాంగ్రెస్ పార్టీ కి నూకలు చెల్లుతాయని తెలంగాణ ప్రజలు బెదిరించి, మెడలు వంచితే సోనియా తెలంగాణ ఇచ్చిందని కెటిఆర్ పేర్కొన్నారు. భారతదేశానికి స్వతంత్రం ఇచ్చింది బ్రిటిష్ వారు అని, బ్రిటిష్ ప్రధాని రిషి సునక్ ఇచ్చారని అంటే ఎంత దరిద్రంగా ఉంటుందో సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చింది అంటే అంత దరిద్రంగా ఉంటుందని కెటిఆర్ అన్నారు. నల్ల చట్టాలు తెచ్చిన బిజెపి కావాలా? జీవితాన్ని వెలుగులు నింపిన భారత రాష్ట్ర సమితి సర్కారు కావాలా ? తేల్చుకోవాలని ఆయన సూచించారు.

రూ.200లు పెన్షన్ ఇవ్వని కాంగ్రెస్
ఇంత భావ దారిద్య్రం, లేకితనం కలిగిన ప్రతిపక్షాలతో పోటీపడాల్సి రావడమే ఈ రాష్ట్రం దురదృష్టమని కెటిఆర్ వాపోయారు. తెలంగాణకు మోడీ ఒక్క పైసా ఇవ్వకున్నా అటు కాంగ్రెస్, బిజెపి పార్టీలు అడగవన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడైనా రూ.4 వేల పెన్షన్ ఇస్తుందా చెప్పాలని కెటిఆర్ ప్రశ్నించారు. 55 సంవత్సరాల్లో రూ.200 దాటి పెన్షన్ ఇవ్వని వారు ప్రస్తుతం రూ.4వేలు ఇస్తామంటే ఎట్లా నమ్ముతారో చె ప్పాలని కెటిఆర్ పేర్కొన్నారు. అధికారంకోసం అడ్డగోలు హామీలు ఇచ్చే కాంగ్రెస్ పార్టీని సోనియా గాంధీ వచ్చి చెప్పినా ప్రజలకు కాంగ్రెస్ పాత చరిత్ర తెలుసన్నారు.

‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్’ ఓ జిమ్మిక్
పాలమూరు ప్రాజెక్టుపై కేసులు వేసి అడ్డంకులు సృష్టించిన పార్టీలు ఈ ప్రాజెక్టు ప్రారంభాన్ని ప్రశ్నిస్తున్నాయని కెటిఆర్ తెలిపారు. 1963లో నెహ్రూ శంకుస్థాపన చేసిన ఎస్సారెస్పీ కాలువను నిన్నటిదాకా కాంగ్రెస్ నాయకులు ప్రారంభించ లేదా ? అని కెటిఆర్ ప్రశ్నించారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలోని 13,14 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే ఈ ప్రాజెక్టును స్వాగతించాలన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా ప్రకటించే ధైర్యం లేని పార్టీలు ఈరోజు మాపైన ఎన్నికల్లో పోటీ అంటున్నాయన్నారు.

తన వైఫల్యాలను కప్పిపుచ్చుకొని ప్రయత్నంలో భాగమే ‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్’ జిమ్మిక్ అని కెటిఆర్ అభివర్ణించారు. ఉద్యమంలో భయపడి రాజీనామా చేయకుండా పారిపోయిన కిషన్‌రెడ్డి ఇప్పుడు తెలంగాణ రా ష్ట్రానికి ముఖ్యమంత్రి అయితా అని కలలు కంటే ఎవరూ పట్టించుకుంటారని కెటిఆర్ ప్రశ్నించారు. దేశంలో మో డీని మా పార్టీ విమర్శించినంతగా ఏ ఇతర పార్టీ అయి నా విమర్శ చేసిందా? కాంగ్రెస్, బిజెపి అవగాహనలో ఉన్నాయని, అందుకే బిజెపిని కాంగ్రెస్ నాయకులు విమర్శించరని, మా నాయకులపై సిబిఐ, ఈడీలు దాడి చేశాయని ఆయన తెలిపారు. ఒక్క కాంగ్రెస్ నాయకుడిపైనా కేంద్ర ఏజెన్సీలు దాడులు చేశాయా? అని కెటిఆర్ ప్రశ్నించారు.

ఎపి పరిణామాలపై మాట్లాడడానికి ఏమీ లేదు?
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పరిణామాలపై మాట్లాడడానికి ఏం లేదన్నారు. పక్కరాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై తమకు ఏం సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు. అది వారి తలనొప్పి అని, తమకు సంబంధం లేదని కెటిఆర్ స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న అస్థిరత, నాయకత్వ లోపం తెలంగాణలో లేదని కెటిఆర్ తేల్చి చెప్పారు.

ఈనెలలోనే 5 ఎస్టీపీల ప్రారంభం
ఈనెల 15వ తేదీన 9 మెడికల్ కాలేజీలను ప్రారంభించుకోనున్నట్టు ఆయన తెలిపారు. 65 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ 5 మెడికల్ కాలేజీలు ఉంటే ఈ 9 సంవత్సరాల కాలంలో 29 మెడికల్ కాలేజీలను ప్రారంభించుకున్న ఘనత బిఆర్‌ఎస్ పార్టీదేనని ఆయన తెలిపారు. 16వ తేదీన పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించుకుంటామని, 17వ తేదీన జాతీయ సమైక్యత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటామని, వీటితో పాటు ఈనెలలోనే నగర పరిధిలో 5 ఎస్టీపీలను ప్రారంభించుకుంటామని ఆయన తెలిపారు. కాళేశ్వరాన్ని తలదన్నేలా పాలమూరు ఎత్తిపోతల పథకం ఉంటుందని, దీనివల్ల 13 నుంచి 14 లక్షల ఎకరాలకు నీరు పారుతుందని ఆయన తెలిపారు. ఈనెల 21వ తేదీన 13,800 డబుల్ బెడ్‌రూం ఇళ్లను గ్రేటర్ పరిధిలో రెండో విడత కింద పంపిణీ చేయనున్నట్టు కెటిఆర్ పేర్కొన్నారు.

మోడీ ప్రకటించిన వరాలన్నీ ఏమయ్యాయి?
ప్రధాని మోడీ 2022 సంవత్సరం వరకు పేదలకు ఇళ్లు కట్టిస్తానని మోసం చేశారని, బుల్లెట్ రైలుపై అతీగతి లేదని, మోడీ ప్రకటించిన వరాలన్నీ ఏమయ్యాయో బిజెపి నాయకులు చెప్పాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. సిలిండర్ ధరను భారీగా పెంచి ప్రస్తుతం రూ.200లు తగ్గించడం పేదలకు ఏవిధంగా మేలు చేసినట్టు అవుతుందో చెప్పాలని కెటిఆర్ ప్రశ్నించారు.

రూ.50 కోట్లకు పిసిసి పదవిని
రేవంత్ రెడ్డి సిఎం కెసిఆర్‌ను ఎప్పుడు తిడుతూ ఉండడమే ఆయన నైజమని కెటిఆర్ తెలిపారు. రేవంత్ రూ.50 కోట్లకు పిసిసి పదవిని కొనుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయని కెటిఆర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News