Sunday, May 5, 2024

తీసుకునేది రూపాయి…. ఇచ్చేది ఆటానా: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: గతంలో ఎల్‌బినగర్ నియోజకవర్గంలో 11 డివిజన్లకు 11 డివిజన్లలో గెలిపించారని మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. మున్సురాబాద్‌లో బిగ్‌బజార్ చౌరస్తాలో జరిగిన రోడ్‌షోల్ మంత్రి కెటిఆర్ మాట్లాడారు. బల్దియాపై గులాబీ జెండా ఎగరడంలో ఎల్‌బినగర్‌ది కీలక పాత్ర అని స్పష్టం చేశారు. ఒకప్పుడు నీళ్లకు హరిగోసపడ్డామని, ఇప్పుడు ఎల్‌బినగర్‌లో రోజు తప్పించి రోజు మంచినీళ్లు ఇస్తున్నామని తెలియజేశారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ ఉంటే వార్త అని, ఇప్పుడు కరెంట్ పోతే వార్త వస్తుందన్నారు. ఎల్‌బినగర్, నాగోల్‌లో టిఆర్‌ఎస్ ప్రభుత్వమే ఫ్లైఓవర్లు నిర్మించిందన్నారు. ఆసరా పెన్షన్లు, ఇంట్లో ప్రతీ ఒక్కరికీ ఆరు కిలోల చొప్పున బియ్యం ఇస్తున్నామని, సర్కారు బడుల్లో సన్నబియ్యంతో అన్నం పెడుతున్నామని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు బాకీ ఉన్నామని, అవి కూడా తప్పకుండా ఇస్తామని కెటిఆర్ హామీ ఇచ్చారు.

కాంగ్రెస్ హయాంలో రూ.200 పెన్షన్ ఉండే రూ.2000 చేశామన్నారు. వరదల సమయంలో పది వేల రూపాయలు ఇచ్చామని, వరద సాయం ఇద్దామంటే నోటికాడ ముద్దను బిజెపోళ్లు అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరేళ్లలో పన్నుల రూపంలో తెలంగాణ ప్రజలు రూ.2 లక్షల 70 వేల కోట్లు కట్టామని, మోడీ ప్రభుత్వం మనకు ఇచ్చింది రూ. 1 లక్ష 40 వేల కోట్లు అని గుర్తు చేశారు. తెలంగాణ నుంచి రూపాయి తీసుకొని ఆటానా మోడీ ప్రభుత్వం ఇస్తుందని మండిపడ్డారు. దేశాన్ని సాదుతున్న ఐదు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటన్నారు. కర్నాటక, గుజరాత్ రాష్ట్రాలకు  వరదలు వస్తే వెంటనే మోడీ ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని, హైదరాబాద్‌కు వరదలు వచ్చాయని నిధులు విడుదల చేయాలని సిఎం కెసిఆర్ కేంద్రానికి లేఖ రాసి బిజెపి ప్రభుత్వం పట్టించుకోలేదని దుయ్యబట్టారు. హైదరాబాద్‌కు నిధులు ఇవ్వకుండా బిజెపోళ్లు ఓట్లు ఎలా అడుగుతున్నారని ప్రశ్నించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News