Sunday, May 5, 2024

మారుమూలలకూ వైద్యం

- Advertisement -
- Advertisement -

KTR inaugurating mobile icu buses

32 మొబైల్ ఐసియు బస్సులను ప్రారంభించిన మంత్రి కెటిఆర్
రాష్ట్రవ్యాప్తంగా కరోనా రోగులకు మరింత అందుబాటులోకి సేవలు
ఆధునిక సదుపాయాలతో త్వరలో మరో 30 బస్సులు
లార్డ్‌చర్చిని అభినందించిన మంత్రి

మన తెలంగాణ/హైదరాబాద్: కొవిడ్, నాన్‌కొవిడ్, పోస్ట్ కొవిడ్ రోగులకు ప్రత్యేక వైద్యం అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 66 మొబైల్ ఐసియూలు అందుబాటులోకి రానున్నాయి. వీటిలో 33 కొవిడ్, నాన్‌కొవిడ్ మరో 33 పోస్ట్ కొవిడ్ కొరకు కేటాయించనున్నారు. ఒక్కో బస్సులో డాక్టర్, ఇద్దరు నర్సులు, ఇద్దరు టెక్నీషియన్లు ఉంటారు. టెలిఫోన్ ద్వారా మరో ఇద్దరు డాక్టర్లు అందుబాటులో ఉంటారు. సుమారు 330 మంది మెడికల్ స్టాఫ్ ఈ మొబైల్ సేవల్లో పనిచేస్తూ రోగులకు సేవలందిస్తారు. దీంతో పాటు 100 మంది అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్, 100 ఆక్సిజన్ నిర్వహుకులు, 530 నుంచి 600 ఫార్మాసీ, ఇతర సిబ్బందిలు ఎప్పటికప్పుడు సమన్వయంతో వైద్యసేవలు అందిస్తారు.
ఐసియూలోని సదుపాయాలు..
బస్సులోని ఐసియూలో సిబి వెంటిలేటర్ నాన్ ఇన్వాసిస్ సపోర్టు సిద్ధంగా ఉంటుంది. అంతేగాక బిపి, ఇసిజి, ఆక్సిజన్ చెకఫ్ కోసం ప్రత్యేక మానిటరింగ్ సిస్టం కూడా ఉంటుంది. దీంతో పాటు మెడికల్ బెడ్స్ విత్ ఐపి , డెడికేటెడ్ ఆక్సిజన్ లైన్, డాక్టర్ ప్రిస్కిప్షన్ బట్టి ప్రతి బెడ్‌లోని రోగి చికిత్సకు అవసరమయ్యే మందులు, స్లైన్లు ఇతర సామాగ్రీ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచుతారు. పేషెంట్‌కు రోగమున్నప్పటికీ బస్సులో అందించే వైద్యంతో పూర్తిగా కోలుకోవచ్చని డాక్టర్లు అంటున్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్‌ను ప్రతి మారుమూల గ్రామాలకు వైద్యం అందించేందుకు తీసుకువెళ్లాలని ప్రభుత్వం భావిస్తుంది.ప్రతి జిల్లాలో ఎప్పటికప్పుడు రోగుల పరిస్థితిని తెలుసుకొని దానికి తగ్గట్లుగా చికిత్స నిర్వహించేందుకు సులువుగా ఉంటుంది. ఇలాంటి విధానం ఇండియాలోనే తొలిసారి అని వైద్యాధికారులు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News