Tuesday, April 30, 2024

పర్యావరణ రక్షణకు పిల్లల యత్నం

- Advertisement -
- Advertisement -

KTR praises cultivation of mango plants by children

మామిడి మొక్కల పెంపకంపై మంత్రి కెటిఆర్ ప్రశంసలు

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అభివృద్ధిలో దూసుకుపోతోంది. అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చి ప్రజల మనస్సుల్లో చెరగని ముద్ర వేసుకుంది తెలంగాణ ప్రభుత్వం. అందు లో భాగంగానే ప్రకృతిని కాపాడేందుకు సిఎం కెసిఆర్ హరి తహారం అనే కార్యక్రమాన్ని తీసుకువచ్చారు. ప్రతి యేటా వర్షాకాలం ఆరంభ సమయంలో ‘హరితహారం’ అనే కార్యక్రమాన్ని ప్రజల్లోకి కెసిఆర్ సర్కార్ విస్తృతంగా తీసుకెళ్తోంది. ఇది లా ఉండగా, తాజాగా తెలంగాణకు చెందిన 7, 11 సంవత్సరాల వయసు కలిగిన ఇద్దరు చిన్నారులు తమ వంతుగా పర్యావరణాన్ని కాపాడే ప్రయత్నం చేశారు. పర్యావరణాన్ని కాపాడటానికి వారి సొంతింట్లోనే మామిడి మొక్కలను ఆ చిన్నారులు పెంచారు. సదరు మొక్కలకు సంబంధించిన ఫోటోలు కాస్త మంత్రి కెటిఆర్ దాకా చేరాయి. ఎప్పుడు ట్వి ట్టర్‌లో యాక్టివ్‌గా ఉండే కెటిఆర్ ఆ చిన్నా రులను మెచ్చుకున్నారు. ‘మీరు చాలా మంచి పనిచేశారు.. చాలా అద్భుతం’ అంటూ చప్పట్ల తో సదరు చిన్నారులపై మంత్రి కెటిఆర్ ప్రశంసల వర్షం కురిపించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News