Friday, April 26, 2024

అన్‌పార్లమెంటరీ వర్డ్.. కేంద్రంపై కెటిఆర్ ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

KTR slams Centre Govt Over Unparliament Word

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ ట్విట్టర్ వేదికగా కేంద్రంపై మరోసారి ధ్వజమెత్తారు. ఎన్‌పిఎ ప్రభుత్వ పార్లమెంటరీ భాష అంటూ కెటిఆర్ వ్యంగంగా ట్వీట్ చేశారు. నిరసనకారులను పిఎం ‘ఆందోళన్ జీవి’ అని పిలవడం మంచిదా? అని ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి చేసిన ‘80-20’ ఓకేనా అని అడిగారు. మహాత్మాగాంధీని బిజెపి ఎంపి కించపరిచిన తీరు బాగానే ఉందా.. ‘షూట్ సాలోంకో’ అని ఓ మంత్రి చెప్పడం సరైందేనా అని కెటిఆర్ నిలదీశారు. రైతు నిరసనకారులను ఉగ్రవాదులను అవమానించారని ఆయన మండిపడ్డారు. ఇవన్నీ సరైనవేనా అని ట్విట్టర్ వేదికగా మోడీని కెటిఆర్ ప్రశ్నించారు. త్వరలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాను న్నాయి. ఈ క్రమంలోనే లోక్‌సభ సెక్రటేరియట్ ఇటీవల విడుదల చేసిన కొత్త బుక్‌లెట్ ప్రకారం.. అన్ పార్లమెంటరీ పదాలను ఉపయోగించడం అనుచిత ప్రవర్తనగా పరిగణించబడుతుందని, సభా కార్యకలాపాలలో భాగం కాదని పేర్కొంది.

ఈ క్రమంలోనే కొన్ని పదాలను ప్రస్తావించింది. ఈ జాబితాలో చేర్చబడిన పదాలు, వాక్యాలు ‘అన్‌పార్లమెంటరీ ఎక్స్‌ప్రెషన్’ వర్గంలో చేర్చారు. వాటిలో జుమ్లా జీవి, కరోనా వ్యాప్తి, జైచంద్, శకుని, లాలీపాప్, చందల్ క్వార్జెట్, గుల్ ఖిలాయే, పిట్టు, అరాచకవాది, వినాశ్‌పురుష్, ఖలిస్థానీ, చీటర్, నికమ్మా, బెహ్రీ సర్కార్, కాలా బజారీ, దలాల్, దాదాగిరి, బేచారా, బాబ్‌కట్, విశ్వాస్‌ఘాత్, సంవేదనహీన్, బ్లడ్‌షెడ్, డాంకీ వంటి పదాలు ఉన్నాయి. ఈ అంశం రాజకీయ దుమారమే రేపుతోంది. వాక్‌స్వాతంత్య్ర హరించే విధంగా ఈ నిర్ణయాలు ఉన్నాయని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఈ క్రమంలోనే తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షాల నుంచి ఎదురయ్యే మాటల యుద్ధాన్ని ఆపేం దుకు మోడీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నదని పేర్కొన్నారు. పార్లమెంటులో నిషేధించబడిన పదాల జాబితాను వివరించే కోల్లేజ్‌ను కూడా మంత్రి పంచుకున్నారు. పార్లమెంట్‌లో పదాల వాడకంపై కేంద్రం నిషేధం విధించడంపై రాజకీయంగా దుమారం రేపుతోంది. ప్రతిపక్షాలు ప్రధాని మోడీ సర్కార్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. జులై 18న జరగనున్న వర్షాకాల సమావేశానికి ముందు ఈ అన్ పార్ల మెంటరీ పదాల జాబితాను లోక్‌సభ సెక్రటేరియట్ విడుదల చేసింది. దీనిపై కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, టిఎంసీ సహా ప్రతిపక్ష పార్టీల నేతల మండిపడ్డారు.

KTR slams Centre Govt Over Unparliament Word

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News