Tuesday, March 19, 2024

కెసిఆర్ లాంటి టార్చ్ బేరర్ దేశానికి అవసరం: మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

KTR Speech at TRS party plenary meeting in Hyderabad

 బీజేపీ చేతిలో అధికారం- దేశానికే అంధకారం

మోడీ పాలనలో దేశాన్ని చీకట్లో నిల్చోపెట్టారు

మతాల పేరుతో కొట్లాడాలి అని ఏ దేవుడు చెప్పిండు?

మేరా భారత్ మహాన్ అనే నాయకుడు దేశానికి కావాలి- ఆ నాయకుని తెలంగాణ అందిస్తుందేమో..

ఉద్వేగాల దేశం కాదు- ఉద్యోగాల దేశం కావాలి

కేసీఆర్ లాంటి టార్చ్ బేరర్ దేశానికి అవసరం

హైదరాబాద్: కెసిఆర్ లాంటి టార్చ్ బేరర్ దేశానికి అవసరమని మంత్రి కెటిఆర్ ఆకాంక్షించారు. చరిత్రలో దశాబ్ద కాలం నిలబడే పార్టీలు నెలకొల్పిందని ఎన్టీఆర్, కెసిఆర్ మాత్రమేనని మంత్రి కెటిఆర్ అన్నారు. ఎన్టీఆర్, కెసిఆర్ మాత్రమే తెలుగువారి గుండెల్లో చెరగని ముద్ర వేశారన్నారు. ఎన్టీఆర్ చరిత్ర సృష్టిస్తే… కెసిఆర్ హిస్టరీతో పాటు జాగ్రఫీ కూడా సృష్టించారని కొనయాడారు. కెసిఆర్ జీవితం ధన్యమైందని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. కెసిఆర్ గొప్ప పాలనాధ్యక్షుడు, పార్టీ నిర్వాహకుడని అరుణ్ జైట్లీ ప్రశంసించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. రైతుబంధు పథకం కేంద్రానికి ప్రేరణ అయిందన్నారు. టిఎస్ ఐపాస్ లాగా కేంద్రం సింగిల్ విండో తెచ్చిందని చెప్పుకొచ్చారు. దేశంలో ఒక్క తెలంగాణలోనే రైతులకు 24 గంటల కరెంట్ అందుతోందన్నారు. ఎండిపోయిన శ్రీరాంసాగర్ కు జీవకళ తీసుకొచ్చిన ఘనత కెసిఆర్ కే దక్కుతుందని పేర్కొన్నారు. నోట్ల రద్దు అపసవ్య ఆలోచనని కెటిఆర్ విమర్శించారు. జన్ ధన్ ఖాతా తెరవండి.. నల్లధనం వెనక్కితెచ్చి ఖాతాల్లో ధన్ ధన్ రూ.15లక్షలు వేస్తామని చెప్పారని తెలిపారు. దేశంలో ప్రజల కష్టాలు డబుల్ చేసిన ఘనత ప్రధాని మోడీకే దక్కుతుందని ఆరోపించారు. కెసిఆర్ విజన్ ఉన్న నేతని మంత్రి కెటిఆర్ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News