Friday, April 19, 2024

నీళ్లిస్తున్నారా.. పెన్షన్లు ఇస్తున్నారా?

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్‌కు చత్తీస్‌ఘడ్‌లో మంచినీళ్లు ఇచ్చే మొఖం లేదు
ఇక్కడకు వచ్చి డైలాగులు కొడుతున్నరు
అక్కడ రైతులు ఎన్ని క్వింటాళ్లు సాగు చేసినా ప్రభుత్వం కొనుగోలు చేసేది 12 క్వింటాళ్లే
మిగతా ధాన్యమంతా మార్కెట్‌కు వెళ్లి మిల్లర్ ఎంత ఇస్తే అంతకు అమ్ముకోవాల్సిందే
పారిశ్రామిక రంగంలో దేశానికే తెలంగాణ తలమానికం
14 ఏళ్ల పాటు పోరాడి తెచ్చుకున్న తెలంగాణ
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజలను గోస పెట్టి మోసం చేసింది
ములుగు జిల్లాలో రూ.150కోట్ల అభివృద్ధి పనులు
రూ.65కోట్లతో కలెక్టర్ కార్యాలయం ప్రారంభం
ఒక కోటి 87 లక్షల యాదవులకు సబ్సిడీ క్రింద గొర్రెల పంపిణీ
మనతెలంగాణ/ములుగుః కాంగ్రెస్ పార్టీకి ఛత్తీస్‌గఢ్‌లో ఇంటింటికీ నల్లా నీరిచ్చే మొఖం లేదు కానీ.. తెలంగాణలో మాత్రం పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కె.టి.రామారావు విమర్శించారు. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా ములుగులో నిర్వహించిన వాటర్ డేలో మంత్రి కెటిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భం ఆయన మాట్లాడుతూ తెలంగాణలోలాగే ఛత్తీస్‌ఘఢ్‌లో వరి, పత్తి సాగవుతుందని, అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు ఎన్ని క్వింటాళ్లు సాగు చేసినా ప్రభుత్వం కొనుగోలు చేసేది 12 క్వింటాళ్లే అని పేర్కొన్నారు. మిగతా ధాన్యమంతా మార్కెట్‌కు వెళ్లి మిల్లర్ ఎంత ఇస్తే అంతకు అమ్ముకోవాల్సిందే తప్ప.. ప్రభుత్వ రక్షణ లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. బుధవారం ములుగు జిల్లాలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాలను గిరిజన పర్యటన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో కార్యక్రమాలను ఏర్పాటుచేయగా, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఐటిశాఖ మంత్రి కెటిఆర్, హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీ, మంత్రి దయాకర్‌రావులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగసభలో మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. చత్తీస్‌ఘడ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అలా ఉంటే.. ఇక్కడకు వచ్చి కాంగ్రెస్ నేతలు పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అక్కడ ఎకరానికి రూ.2 వేలు కూడా పంట పెట్టుబడి ఇచ్చేది లేదని పేర్కొన్నారు. ఇక్కడ తెలంగాణలో ఎకరానికి రూ.10 వేలు ఇస్తున్న కెసిఆర్‌ను అదే కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ మంచినీళ్లు ఇచ్చే మొఖం లేదు కానీ, ఇక్కడకు వచ్చి మాత్రం పెద్ద డైలాగ్‌లు కొడుతున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నేతలు తెలంగాణలో యాక్టింగ్‌లు, ఉపన్యాసాలు, ఊదరగొట్టే డైలాగులు, ప్రజలను ఆగం చేసే కార్యక్రమాలు చేస్తున్నరని విమర్శించారు. ఛత్తీస్‌ఘఢ్‌లో 24 గంటల ఉచిత కరెంటు ఉన్నదా..? అని ప్రశ్నించారు. మరి ఎవరి ఆదరిద్దాం.. ఎవరిని ప్రోత్సహిద్దామో ఆలోచించాలని కోరారు. ఎందుకు దశాబ్ది ఉత్సవాలు చేస్తున్నారని కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని, వారికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మనపై ఉన్నదని కెటిఆర్ చెప్పారు.

ప్రతిపక్ష ఎంఎల్‌ఎ ఉన్నా ములుగును అభివృద్ధి చేస్తున్నాం..
ఇక్కడున్న గిరిజన, లంబాడాలు ఎన్నో ఏళ్ల నుంచి మా తండాల్లో మా రాజ్యం ఉండాలి, మా ఊళ్లో మా సర్పంచ్ ఉండాలని దశాబ్దాల నుంచి గొంతు చించుకున్నా పట్టించుకున్న నాయకుడు లేడని, కెసిఆర్ వచ్చాకనే ఈ రాష్ట్రంలో 3,146 తండాలు, గూడాలు గ్రామ పంచాయతీలు అయ్యాయని కెటిఆర్ పేర్కొన్నారు. ఎక్కడో హైదరాబాద్‌కు, అభివృద్ధికి దూరంగా విసిరేసినట్టు ఉన్న ములుగు ఒకనాడు.. తాలూక కేంద్రం కావాలంటే గగనం అని, గ్రామ పంచాయతీ కూడా కాని ములుగు ఇప్పుడు మున్సిపాలిటీగా, జిల్లా కేంద్రం అయ్యిందని తెలిపారు. ములుగు శాసనసభ్యురాలు ప్రతిపక్షమైనా, ఇక్కడ ఉన్నది మనబిడ్డలేనని వివక్ష చూపొద్దని చెప్పి నలుగురు మంత్రులను సిఎం కెసిఆర్ ములుగుకు పంపారని గుర్తు చేశారు.

ఉత్తగనే ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చిపోయేందుకు రాలేదని, ఏం చేశామో, ఏం చేయబోతున్నమో చెప్పేందుకు వచ్చామని చెప్పారు.దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ములుగు జిల్లాలోనే 17వేల ఎకరాలకు పోడు భూముల పట్టాలు అందజేయనున్నామని కెటిఆర్ వెల్లడించారు. ములుగు జిల్లా కేంద్రంగా మారిన తర్వాత గ్రామ పంచాయతీ ఉంటే బాగుండదని చెప్పి గత శాసనసభ సమావేశాల్లో ములుగు గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా మార్చామని తెలిపారు. జిల్లా కేంద్రంలో కలెక్టర్, ఎస్‌పిలు కూర్చుకునేందుకు, ప్రజలు వచ్చి సమస్యలు పరిష్కరించుకునేందుకు మంచి సౌలత్‌లు ఉండాలని, అందుకే రూ.65 కోట్లతో కలెక్టర్ కార్యాలయానికి లాంఛనంగా శంకుస్థాపన చేసుకున్నామని తెలిపారు.

9 ఏళ్లలో తెలంగాణ పాలనలో మార్పు చూడండి
పారిశ్రామిక రంగంలో దేశానికే తెలంగాణ తలమానికమని కాంగ్రెస్ పాలనలో ప్రజలను గోస పెట్టి మోసం చేసిందని కెటిర్ పేర్కొన్నారు. 9 ఏళ్ల తెలంగాణ ప్రభుత్వం పాలనలో అనేక సంక్షేమ పథకాలను చేపట్టిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్‌దేనని, ఏ దేశంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని అభివృద్ధి పనులు చేసిన ఘనత ముఖ్యమంత్రిదేనని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి 24గంటల విద్యుత్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, పల్లె ప్రగతి, రైతులకు రుణమాఫీ, రైతు బీమా, రైతుబంధు లాంటి అభివృద్ధి పనులు రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు మినీ ఫెస్టివల్‌లో చెప్పిన కాకుండానే ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయని, అలాగైతేనే తెలంగాణ అభివృద్ధిలో దేశంలోనే ముందంజలో ఉందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ములుగును జిల్లా చేస్తానని వాగ్ధానం చేసి ములుగు జిల్లాలు ఏర్పాటుచేశారు.

మరల మున్సిపాలిటీ ఇస్తానని ఒప్పుకోవడం జరిగింది అలాగే ములుగు జిల్లాలో కొత్తగా రెండు మండలాలను కూడా ఏర్పాటుచేసిన ఘనత ముఖ్యమంత్రిదేనని అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రతి గ్రామానికి వైకుంఠధామం, షెగ్రిగేషన్ షెడ్‌ల నిర్మాణం, డంపింగ్ యార్డులు, చెత్తకుండీలను ఏర్పాటుచేశారన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి వాటర్ ట్యాంక్ నిర్మాణం చేసినట్లు తెలిపారు. ములుగు జిల్లా అభివృద్ధి కొరకు రూ.150కోట్ల నిధులను మంజూరు చేశారని, రూ.65కోట్లతో కలెక్టర్ కార్యాలయం, రూ.12కోట్లతో ఐదు మోడల్ పోలీస్‌స్టేషన్‌లో ములుగు బస్‌స్టేషన్‌కు రూ.10కోట్లు, సిసి రోడ్లకు రెండు కోట్లు, యాదవులకు ఒక కోటి 87లక్షలు, సైడ్ కాల్వలకు రెండు కోట్లు, లైబ్రరీకి రూ.50లక్షలు, ఎస్‌సి, ఎస్‌టిలకు రెండు కోట్ల 30లక్షలు, ములుగు వైకుంఠధామంకు రూ. 1కోటి, ఇలా ములుగు జిల్లాను అభివృద్ధి చేసేందుకు రాబోయే రోజుల్లో ఇంకా పెద్దయెత్తున నిధులు కేటాస్తామని తెలిపారు. ములుగు జిల్లాలో మారుమూల ప్రాంతంలో ఉన్న గిరిజనులకు కూడా సాగునీరు, త్రాగునీరు అందించే విధంగా కోట్ల ఖర్చుతో పనులు ఏర్పాటుచేశామని అన్నారు.

ములుగు జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజి, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుతో భారతదేశంలోనే ములుగు జిల్లా రెండవ స్థానంలో ఉందని అన్నారు. రూ.65 లక్షల మంది రైతులకు రైతుబంధు ఇవ్వడం జరుగుతుందన్నారు. పక్కనే ఉన్న ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదని, అదేవిధంగా ఎకరానికి 10క్వింటాళ్ల ధాన్యం ఎక్కువ తీసుకోమని అక్కడి ప్రభుత్వం చెబుతుంది కానీ మన తెలంగాణ ప్రభుత్వం ప్రతి గింజ రైతుల వద్ద నుండి కొని గిట్టుబాటుధర రైతులకు కల్పించిన ఘనత మన తెలంగాణ రాష్ట్రంలోనే ఉందన్నారు. వైద్య రంగంలో ములుగు జిల్లా హైదరాబాద్‌ను మించి పోయిందన్నారు. జిల్లాలో 200 పడకల ఆసుపత్రిని ఏర్పాటుచేశామని, మారుమూల గ్రామంలో ఉన్న ఏటూరునాగారంలో కూడా నాణ్యమైన వైద్యం అందించడం జరుగుతుందని తెలిపారు. రైతులకు త్రిఫేజ్ విద్యుత్‌ను వ్యవసాయానికి ఉచితంగా అందిస్తున్నామని, ఇప్పటి వరకు కూడా రైతులకు విద్యుత్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News