Tuesday, March 21, 2023

జాతరలో అల్లుడిని నరికి చంపిన మామ…

- Advertisement -

అమరావతి: కుటుంబ గొడవల నేపథ్యంలో అల్లుడిని మామ హత్య చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. దేవన కొండ మండలం పి కోటకొండలో మామ లింగమయ్య, అల్లుడు సూర్య ప్రకాశ్ మధ్య గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో జాతర రోజుల అల్లుడిని హతం చేయాలని మామ ప్లాన్ వేసుకున్నాడు. జాతర జరుగుతుండగా కత్తులు తీసుకొని జాతరకు మామ వెళ్లాడు. కత్తి తీసుకొని అల్లుడిని నరకడంతో అతడు ఘటనా స్థలంలోనే చనిపోయాడు. పోలీసులు గ్రామంలో ఉన్నప్పటికి ఈ హత్య కొని సెకన్ల వ్యవధిలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles