Tuesday, May 14, 2024

దేవకన్యలతో నాగ్ ఆటా పాట..

- Advertisement -
- Advertisement -

‘సోగ్గాడే చిన్నినాయన’ చిత్రంతో కింగ్ నాగార్జున, దర్శకుడు కళ్యాణ్ కృష్ణ మ్యాజిక్ చేశారు. ఈ చిత్రానికి ప్రీక్వెల్‌గా ఇప్పుడు బంగార్రాజు చిత్రం రాబోతోంది. అనూప్ రూబెన్స్ ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రానికి ఇచ్చిన సంగీతం ఎంత ప్లస్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ‘బంగార్రాజు’ కోసం మరోసారి అధ్బుతమైన ట్యూన్స్ రెడీ చేశారు. ఇటీవల రిలీజ్ చేసిన లడ్డుండా… పాటకు సంబంధించిన ప్రోమో అందరినీ ఆకట్టుకుంది. తాజాగా లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. అనూప్ రూబెన్స్ క్యాచీ ట్యూన్‌ను అందించారు. నాగార్జున మాటలతో ఈ పాట ప్రారంభం అవుతుంది. తన తబలా, హార్మోనియం రెడీయా అంటూ పాటకు సిద్దమవుతారు. నాగార్జున ప్రత్యేకమైన యాసలో పాడిన పాట, పలికిన పదాలు అందరినీ మెప్పించాయి. పంచెకట్టులో మరోసారి నాగార్జున అందరినీ కట్టిపడేశారు. ఈ పాటలో స్వర్గంలోని దేవ కన్యలతో ఈ స్టార్ హీరో డ్యాన్స్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. నాగార్జునతో పాటుగా ధనుంజయ్, మోహన భోగరాజు, నూతన మోహన్, హరిప్రియలు ఈ పాటను ఆలపించారు. భాస్కర భట్ల క్యాచీ పదాలతో మంచి సాహిత్యం అందించారు. ఈ చిత్రంలో యువ సామ్రాట్ నాగ చైతన్య మరో హీరోగా నటిస్తున్నారు. రమ్యకృష్ణతో పాటుగా కృతి శెట్టి కూడా ఈ చిత్రంలో కనిపించబోతోన్నారు. మంగళవారం మైసూర్ షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ లో ప్రధాన తారాగణం మీద కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Laddunda song released from ‘Bangarraju’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News