Friday, April 26, 2024

ఛాలెంజింగ్ పాత్రలో కనిపిస్తా

- Advertisement -
- Advertisement -

సందీప్ కిషన్ హీరోగా లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’. టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా పన్నెం నిర్మించిన ఈ చిత్రం మార్చి 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ లావణ్య త్రిపాఠి మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…

నిజ జీవితానికి దగ్గరగా…
ఈ చిత్రంలో నేను ఛాలెంజింగ్ పాత్రలో నటించాను. తమిళ్ రీమేక్ అయిన ఈ చిత్రాన్ని తెలుగు నేటివిటీకి అనుగుణంగా తెరకెక్కించారు. సినిమాలో నా పాత్ర నిజ జీవితానికి దగ్గరగా ఉండడంతో సులభంగా నటించాను.
ప్రత్యేకంగా ట్రైనింగ్…
హాకీ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఈ చిత్రం కోసం హాకీ క్రీడాకారుల బాడీలాంగ్వేజీ ఎలా ఉండాలో ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకున్నా. అలాగే పాత హాకీ మ్యాచ్‌లు కూడా చూశాను. సినిమాలో సందీప్‌కిషన్, నా పాత్ర రెగ్యులర్ హీరో హీరోయిన్లలాగా ఉండవు.
మంచి లవ్ ట్రాక్…
హీరో సందీప్ మంచి సహ నటుడు. గతంలో మేమిద్దం ‘మాయావన్’ చిత్రంలో కలిసి నటించాము. ఇక ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’లో మా ఇద్దరి మధ్య మంచి లవ్ ట్రాక్ ఉంటుంది.
అద్భుతంగా తెరకెక్కించాడు…
దర్శకుడు డెన్నిస్ జీవన్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. సంగీత దర్శకుడు హిప్‌హాప్ తమిళ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఇక ఈ చిత్రంతో మంచి హిట్ కొడతానన్న నమ్మకం నాకుంది.

Lavanya Thripati Special Interview

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News