Wednesday, May 1, 2024

దానికి నేను షాకయ్యా..

- Advertisement -
- Advertisement -

సందీప్‌కిషన్ హీరోగా లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో తెరకెక్కిన స్పోర్ట్ డ్రామా ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’. ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా సందీప్‌కిషన్ మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…

మంచి కంటెంట్‌తో…
నా 25వ సినిమా ఒక రీమేక్ అనే దానికన్నా మంచి కంటెంట్ ఉన్న సినిమా అని చెప్పవచ్చు. ఫ్యామిలీతో కలిసి అందరూ ఈ సినిమాను ఎంజాయ్ చేయవచ్చు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా ఇది.
కెమిస్ట్రీ సూపర్బ్‌గా…
ఈ సినిమాలో ప్రేక్షకులకు కావాల్సిన అన్ని కమర్షియల్ అంశాలుంటాయి. నాకు, లావణ్యకి మధ్య కెమిస్ట్రీ సూపర్బ్‌గా వర్కవుట్ అయింది. దీన్ని ఒక కొత్త కమర్షియల్ ఫిలిం అని నేను చెబుతాను.
హాకీ నేర్చుకున్నా…
ఈ సినిమా ప్రారంభానికి ముందుగా ఆరు నెలలు హాకీ నేర్చుకున్నా. ఒక అథ్లెట్ రోల్ చేయాలి అంటే అలా కనిపించాలి. ముఖ్యంగా ఆ ఆట కూడా రావాలి. అందుకే హాకీ నేర్చుకొని ఈ సినిమా చేశా. సినిమాలో మాత్రం హాకీ గేమ్ అదిరిపోద్ది.
నేను షాకయ్యా…
ఈ సినిమా కోసం అండర్ 19లో ఆడిన రియల్ హాకీ ప్లేయర్స్ 8 మందిని తీసుకొచ్చాం. వాళ్ళు ఒక్క రోజుకు 5వేలు అడిగారు. దానికి నేను షాకయ్యా. ఇంత తక్కువా అని అంటే దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు… వాళ్ల పరిస్థితి ఎలా ఉంది అన్నది. అందుకే ఇలాంటి పాయింట్‌నే ఈ సినిమాలో చూపించాము.
అందుకే డెన్నిస్‌తో చేశా…
నాకు ఎప్పుడూ డెబ్యూ డైరెక్టర్‌లే వర్కవుట్ అయ్యారు. ఇప్పటి వరకు నేను కలిసి పనిచేసిన వాళ్లు ఫస్ట్ లేదా సెకండ్ సినిమా దర్శకులే. లోకేష్ కనగరాజ్, విఐ ఆనంద్ తదితరులతో కలిసి పనిచేశాను. కాబట్టి కొత్త దర్శకుడు డెన్నిస్‌తో కలిసి ఈ సినిమా చేశాను.
తదుపరి చిత్రాలు…
నేను చేస్తున్న ‘రౌడీ బేబీ’ దాదాపుగా పూర్తయింది. ఇక ‘వివాహ భోజనంబు’ చాలా క్యూట్ ఫిల్మ్. ఇది పూర్తి కాగానే మహేష్ కోనేరు ప్రొడక్షన్‌లో ఒక సినిమా, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో మరొక సినిమా చేయాల్సి ఉంది.

Sandeep Kishan full Interview

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News