Friday, April 26, 2024

‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుంది

- Advertisement -
- Advertisement -

'A1 Express' movie pre release event

సందీప్ కిషన్ హీరోగా లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వెంకటాద్రి టాకీస్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్ బ్యానర్లపై డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో టిజి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా పన్నెం సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‘. హాకీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లోని వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎనర్జిటిక్ స్టార్ రామ్ ముఖ్యఅతిధిగా విచ్చేయగా ప్రముఖ నిర్మాతలు జెమిని కిరణ్, అనిల్ సుంకర, యం.యల్ కుమార్ చౌదరి, రచయితలు కోన వెంకట్, లక్ష్మీ భూపాల్, బెజవాడ ప్రసన్న, ఛోటా కె.నాయుడు, హీరో సందీప్ కిషన్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి, దర్శకుడు డెన్నిస్ జీవన్ కానుకొలను, వివేక్ కూచిబొట్ల, టి.జి.విశ్వప్రసాద్ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ.. “ఏ1 ఎక్స్‌ప్రెస్ ట్రైలర్ చూస్తుంటే పెద్ద సినిమా రేంజ్‌లో కనిపిస్తోంది. సందీప్ కెరీర్‌లో ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుంది. హిప్ హాప్ తమిళ మ్యూజిక్ చాలా బాగుంది”అని అన్నారు. హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ “ఈ చిత్రాన్ని 40 రోజుల్లో పూర్తి చేశాము. డెన్ని షార్ట్‌ఫిలిమ్స్‌తో ఆకట్టుకొని బిగ్ స్పాన్ ఉన్న ఈ మూవీ చేశాడు. హిప్ హాప్ తమిళ ఇచ్చిన ఐడియాతో ఈ సినిమాని ప్రారంభించడం జరిగింది. అతను బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు”అని తెలిపారు. చిత్ర దర్శకుడు డెన్నిస్ జీవన్ కనుకొలను మాట్లాడుతూ “ముందుగా సందీప్ కిషన్‌కి కథ చెప్పాను. ఆయనకు నచ్చి వెంటనే ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు”అని చెప్పారు.

‘A1 Express’ movie pre release event

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News