Saturday, April 27, 2024

చించోలిలో చిరుత భయం .

- Advertisement -
- Advertisement -

సారంగాపూర్ ః మండలంలోని చించోలి(ఎం) గ్రామానికి చిరుత భయం పట్టుకొంది . బుధవారం గ్రామ శివారులో అప్పుడు జన్మించిన లేగ దూడను చిరుత పులి చెట్టు పైకి ఎత్తుకెళ్లి తినేసిన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే . ఎప్పటిలాగే యజమాని ప్రశాంత్ రెడ్డి తన గేదెను గేదెల మందకు తీసుకెళ్లాడు . పాలేరు మేత కోసం అడవికి తీసుకెళ్లగా ఈ గేదె తప్పిపోయి లేగ దూడకు జన్మనిచ్చి ఇంటికి రాలేకపోయింది. సాయంత్రం యజమాని కుటుంబ సభ్యులు ఎంత వెతికినా కనిపించకపోవడంతో ఉదయం మళ్లీ అడవికి వెళ్లి చూడగా గేదె కనిపించింది. కానీ లేగ దూడ మాత్రం చెట్టు పై మృతి చెంది కనిపించడంతో ఇది చిరుత పులి పనేనని నిర్థారించుకున్నాక అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన అధికారులు రైతులు పంట పొలాల్లోకి ఒంటిరిగా వెళ్లకూడదని , అలాగే రాత్రి సమయాల్లో బయటకు వెళ్లవద్దని పలు హెచ్చరికలు జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News