Saturday, April 27, 2024

లెస్బియన్ క్యారెక్టర్‌లో రెజీనా

- Advertisement -
- Advertisement -

Lesbian role as regina in bollywood

తెలుగులో ‘ఎస్‌ఎంఎస్’ సినిమాతో తన కెరీర్‌ని ప్రారంభించిన రెజీనా ఆతర్వాత రొటీన్ లవ్ స్టోరీ, పవర్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలతో హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకుంది. మొదటి నుండి గ్లామర్ షోకి వెనుకాడని ఈ భామ నక్షత్రం, మిస్టర్ చంద్రమౌళి సినిమాలలో విపరీతంగా అందాలను ఆరబోసింది. తెలుగులో చాలాకాలంగా హిట్ కోసం ప్రయత్నిస్తున్న రెజీనా.. తమిళంలో ఓ సీనియర్ యాక్టర్ కొడుకు పరిచయమైన ’మిస్టర్ చంద్రమౌళి’ సినిమాలో రెచ్చిపోయి నటించింది. హీరో ఫస్ట్ సినిమా అయినప్పటికీ రెజీనా గ్లామర్ షో కోసం కాసులు బాగానే ముట్టజెప్పారట. అందుకనే అమ్మడు ఎక్కడా తగ్గకుండా రొమాన్స్ చేసింది. కానీ ఈ భామ ఎన్ని అందాలు ఆరబోసిన కోలీవుడ్‌లో హిట్ మాత్రం పడట్లేదు. ఇదిలా ఉండగా.. ఓ బాలీవుడ్ సినిమాలో సోనమ్ కపూర్‌కు లెస్బియన్ గర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తోందట రెజీనా. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంత బోల్డ్ గా నటిస్తే అంత ప్లస్. అక్కడ రెచ్చిపోయి గ్లామర్ షో చేస్తూ నటించే హీరోయిన్లకు అవకాశాలకు కొదవ ఉండదు. మరి రెజీనా లెస్బియన్ పాత్రతో పాన్ ఇండియా స్టార్ అయిపోతుందేమో చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News