Friday, May 3, 2024

సితు పాపా టర్న్ 8

- Advertisement -
- Advertisement -

Sitara 8th birth day celebrations with Mahesh babu

 

సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార సోమవారం తన పుట్టినరోజును జరుపుకుంది. ఆమె తన 8వ పుట్టినరోజును ఇంట్లోనే జరుపుకుంది. ఈ సంధర్భంగా సూపర్ స్టార్ ఈ ప్రత్యేక రోజున సితారకు ప్రేమతో విషెష్ చెబుతూ ట్వీట్ చేశాడు. “చాలా వేగంగా ఎనిమిదేళ్లు గడిచాయి. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు” అని మహేష్ ‘సితు పాపా టర్న్ 8’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను కూడా యాడ్ చేస్తూ ట్వీట్ చేశాడు. ఇక సితార జీవితంలో కొన్ని ఉత్తమ క్షణాలకు సంబంధించి చిన్న వీడియోను కూడా అభిమానులతో మహేష్ పంచుకున్నారు. ఇక సోషల్ మీడియాలో సితారకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చిత్ర పరిశ్రమకు చెందిన తారలతో పాటు, మహేష్ అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్స్ పెడుతున్నారు. సితార వయసు చిన్నదే అయినప్పటికీ సోషల్ మీడయాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News