Thursday, May 2, 2024

మాజీ ప్రధాని హత్యకేసు: నళిని ఆత్మహత్యాయత్నం

- Advertisement -
- Advertisement -

Rajiv Gandhi killer Nalini attempts suicide

చెన్నై: భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో గత 29 ఏండ్లగా తమిళనాడులోని వేలూరు జిల్లా తోరప్పాడి కారాగారంలో శిక్ష పొందుతున్న నళిని ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. మహిళ జైలు గార్డులతో వాగ్వాదం తర్వాత గొంతు కోసుకునేందుకు యత్నించింది. దీంతో అప్రమత్తమైన జైలు సిబ్బంది నళినిని అడ్డుకున్నారు. ప్రస్తుతం ఆమె సురక్షితంగా ఉన్నట్టు జైలు అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని నళిని లాయర్ పుహళేంది వెల్లడించారు. రాజీవ్ గాంధీ హత్య కేసులో నళినికి జీవితఖైదు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. బెయిలు కోసం ప్రయత్నిస్తున్న నళిని ఇటీవల పెరోల్‌పై కుతూరు  వివాహం కోసం 6 నెలలపాటు బయటకు వచ్చారు. పెరోల్ ముగిసిన అనంతరం తిరిగి జైలుకు వెళ్లారు. సుదీర్ఘకాలం నుంచి జైలుశిక్ష అనుభవిస్తున్న మహిళగా గుర్తింపు పొందిన నళిని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడం కలకలం రేపుతోంది.

Rajiv Gandhi killer Nalini attempts suicide

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News