Wednesday, May 22, 2024

వరద నీటిని ఒడిసి పడదాం

- Advertisement -
- Advertisement -

మక్తల్ : గత ఏడాది కంటే ముందుగానే ఈసారి కృష్ణానది వరద నీటిని పంపింగ్ చేస్తున్నామని, వరదనీరు ముందుకు వృథాగా పోకుండా ఒడిసి పట్టుకొని మక్తల్ నియోజకవర్గంలోని చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, భూత్పూర్ రిజర్వాయర్లతో పాటు చెరువులకు జలకళను తీసుకువద్దామని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకం ఫేజ్..1లో భాగంగా నిర్మించిన చిన్నగోప్లాపూర్ పంప్‌హౌజ్ వద్ద ఆదివారం ఆయన మోటార్లను ఆన్‌చేసి వరదనీటి పంపింగ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సీజన్‌లో వర్షాలు ప్రారంభం కావడంతో పంపింగ్‌ను ప్రారంభించామన్నారు.

రోజూ 650 క్యూసెక్కుల నీటిని ఒక మోటారు ద్వారా సంగంబండ రిజర్వాయర్‌కు ఎత్తిపోస్తున్నామన్నారు. త్వరలోనే మరో మోటారు ద్వారా భూత్పూరు జలాశయానికి నీటిని ఎత్తిపోస్తామన్నారు. ముందస్తుగానే పంపింగ్‌ను ప్రారంభించడంతో ఈ ఏడాది ప్రాజెక్టులతో పాటు నియోజకవర్గంలోని దాదాపు 120చెరువుల్లో జలకళతో నిండుకుండల్లా మారాలన్నారు. త్వరలోనే పంటలకు సాగునీటిని విడుదల చేస్తామని, రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు.

అనంతరం సాయంత్రం మక్తల్ సమీపంలోని ఖానాపూర్ స్టేజ్..2 పంప్‌హౌజ్ వద్ద పంపింగ్‌ను ఆయన ప్రారంభించి, కృష్ణమ్మకు ప్రత్యేక పూజలను నిర్వహించారు. కార్యక్రమంలో సీఈ రమణారెడ్డి, ఎస్‌ఈ నాగేశ్వరరావు, ఈఈ సంజీవప్రసాద్, డీఈ వెంకటరమణ, ఏఈ రహీం, ఇంజనీర్లు షకీల్, కృష్ణ, మక్తల్ ఎంపిపి వనజమ్మ, నాయకులు ఎల్లారెడ్డి, రుద్రసముద్రం రామలింగం, శేఖర్‌రెడ్డి, నేతాజీరెడ్డి, ఈశ్వర్ యాదవ్, శివారెడ్డి, చిన్నగోప్లాపూర్ సర్పంచ్ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News