Friday, April 26, 2024

నగరంలో తేలికపాటి వర్షం

- Advertisement -
- Advertisement -

Light rain in Hyderabad

హైదరాబాద్: నగరంలో మంగళవారం తేలికపాటి వర్షం కురిసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం ప్రభావంతో నగరంలో పలు ప్రాంతాల్లో చిరు జల్లులతోపాటు మోస్తారు వర్షం కురిసింది. నగరంఉదయం నుంచి ఎండగా ఉన్నవాతావరణ మధ్యాహ్ననానికి ఒక్కసారిగా చల్లబడింది. అనంతరం సాయంత్రం నగరంలో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, ఎల్‌బినగర్, మాదాపూర్, యూసుఫ్‌గూడ, సరూర్‌నగర్, ఫలక్‌నుమా, మూసాపేట్, సౌత్ హస్తినాపురం, చంద్రాయణ్‌గుట్ట, హయత్‌నగర్, మలక్‌పేట్, తదితర ప్రాంతాల్లో 5.8 మి.మి. నుంచి 2 మి.మి. వర్షపాతం నమోదైంది. అల్పపీడనం ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News