Friday, April 26, 2024

రాష్ట్రంలో తేలిక పాటి వర్షాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాగల రెండు రోజులు తెలంగాణలో ఉరుములు, మెరుపులతో తేలిక పాటి వర్షాలు కురువనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం రాత్రి నుంచి నేటి సోమవారం ఉదయం వరకు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, యాదాద్రి భువనగిరి,

వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వానపడే అవకాశాలున్నాయని, మిగతా చోట్ల అక్కడక్కడ జల్లులు కురుస్తాయని తెలిపింది. సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. మంగళవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుందని వివరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News