Sunday, April 28, 2024

ఎపిలో మోగిన స్థానిక ఎన్నికల నగారా

- Advertisement -
- Advertisement -

Local body elections

 

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మూడు రకాల స్థానిక సంస్థల ఎన్నికలు మూడు దశల్లో జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ప్రకటించారు. తొలిదశలో జడ్‌పిటిసి, ఎంపిటిసిలను ఒకే విడతలో ఈ నెల 21న, రెండో దశలో 23న మున్సిపల్ ఎన్నికలు.. మూడో దశలో గ్రామ పంచాయతీ సర్పంచి, వార్డు సభ్యుల ఎన్నికలు 27, 29 తేదీల్లో రెండు విడతలుగా నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఎంనిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికల నోటిఫికేషన్‌వెంటనే అమలులోకి వస్తుందని.. మున్సిపల్‌ఎన్నికలకు 9న, గ్రామ పంచాయతీ ఎన్నికలకు రెండు విడతలుగా 15, 17 తేదీల్లో నోటిఫికేషన్‌ను వేర్వేరుగా విడుదల చేస్తామని రమేష్ కుమార్ తెలిపారు. ఎన్నికల నియమావలి కూడా తక్షణమే అమలులోకి వస్తుందని అన్నారు.

ఈక్రమంలో రాష్ట్రాన్ని యూనిట్‌గా పరిగణించి రిజర్వేషన్లు ఖరారు చేశామని మున్సిపల్ శాఖ కమిషనర్‌విజయ్‌కుమార్‌తెలిపారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కార్పొరేషన్లలో 672 డివిజన్లు, మున్సిపాలిటీల్లో 2,123 వార్డులకు కోర్టు తీర్పును అనుసరించి రిజర్వేషన్లు ప్రకటించామని పేర్కొన్నారు. 33 శాతానికిపైగా బిసిలకు రిజర్వేషన్లు ఇచ్చామని పేర్కొన్నారు. 16 కార్పొరేషన్లకు రిజర్వేషన్లు ఖరారు చేయగా.. 12 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. మూడు కార్పొరేషన్‌లకు కోర్టు వివాదాలు ఉన్నాయని చెప్పారు. 103 మున్సిపాలిటీల్లోరిజర్వేషన్లు పూర్తయినట్లు వెల్లడించారు. ప్రస్తుతం 74 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయని, 29 మున్సిపాలిటీల్లో విలీన, కోర్టు సమస్యల వల్ల ఎన్నికలు వాయిదా పడ్డాయని విజయ్‌కుమార్‌తెలిపారు.

Local body elections in AP
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News