Friday, May 10, 2024

లోక్‌సభలో ఆర్థిక బిల్లు ఆమోదం

- Advertisement -
- Advertisement -

Nirmala SitaRaman
2023 ఆర్థిక సంవత్సరం కసరత్తు పూర్తి

న్యూఢిల్లీ: లోక్‌సభ శుక్రవారం ఆర్థిక బిల్లును ఆమోదించింది. దీంతో కొత్త పన్నులు, 2022—23 ఆర్థిక సంవత్సరం బడ్జెటరీ కసరత్తు పూర్తయింది. 39 అధికారిక సవరణల తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఆర్థిక బిల్లు ఆమోదం పొందింది. కాగా ప్రతిపక్షం ప్రతిపాదించిన సవరణలను మూజువాణి ఓటుతో తిరస్కరించడం జరిగింది. కొవిడ్ వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడీలో పెట్టడానికి కొత్త పన్నులు వేయని దేశం బహుశా భారత్ ఒక్కటే కావొచ్చని నిర్మలా సీతారామన్ ఈ సందర్భంగా చెప్పారు. ఓఇసిడి రిపోర్టు ప్రకారం దాదాపు 32 దేశాలు మహమ్మారి తర్వాత పన్ను రేట్లను పెంచాయని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. మోడీ ప్రభుత్వం పన్నుల తగ్గించాలనుకుంటోందని, కార్పొరేట్ పన్నును తగ్గించడం వల్ల ఆర్థిక రంగానికి, ప్రభుత్వానికి, కంపెనీలకు మేలు జరిగిందని, తద్వారా మనం పురోగతి సాధిస్తున్నామని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. కార్పొరేట్ పన్ను కింద ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 7.3 లక్షల కోట్లు సేకరించామని తెలిపారు. పన్ను చెల్లింపు దారులు గత కొన్ని సంవత్సరాలలో 5 కోట్ల నుంచి 9.1 కోట్లకు పెరిగారని కూడా తెలిపారు. గొడుగు మీద కస్టమ్స్ సుంకాన్ని విధించడం గురించి ప్రతిపక్ష సభ్యులు ప్రశ్నించగా ఎంఎస్‌ఎంఇలు తయారు చేసే దేశీయ ఉత్పత్తులను ప్రోత్సాహించడానికే అలా చేశామని తెలిపారు. గుజరాత్‌లో ఐఎఫ్‌ఎస్‌సి స్థిరమైన పురోగతి సాధిస్తోందని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్‌సిటీ(జిఐఎఫ్‌టి) వద్ద అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రం కార్యాలయాలను అనేక గ్లోబల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీలు ఏర్పాటు చేస్తున్నాయని కూడా ఆమె తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News