Tuesday, April 30, 2024

ఈ-స్మార్ట్ క్లినిక్ ను ప్రారంభించిన లార్డ్స్ మార్క్ ఇండస్ట్రీస్, ఉన్నత్ భారత్

- Advertisement -
- Advertisement -

ముంబై: IIT ఢిల్లీకి చెందిన FITT (ఫౌండేషన్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్), భారత ప్రభుత్వంచే ప్రారంభించబడిన జాతీయ కార్యక్రమం అయిన ఉన్నత్ భారత్ అభియాన్ సహకారంతో IVD ఉత్పత్తుల, ప్రముఖ తయారీదారు, లార్డ్స్ మార్క్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నేడు గ్రామీణ భారతదేశంలో హెల్త్‌కేర్ యాక్సెస్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ఉద్దేశించిన విప్లవాత్మక ఈ – స్మార్ట్ క్లినిక్ ప్రాజెక్ట్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్రాజెక్టును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాజ్‌కోట్ ఎయిమ్స్‌లో ప్రారంభించారు.

ఈ సందర్భంగా లార్డ్స్ మార్క్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మానవ్ తేలి వ్యాఖ్యానిస్తూ.. “ఉన్నత్ భారత్ అభియాన్‌తో కలిసి అద్భుతమైన ఈ- స్మార్ట్ క్లినిక్ ప్రాజెక్ట్‌ను పరిచయం చేయడం పట్ల సంతోషిస్తున్నాను. ప్రజలందరికీ, సమానమైన ఆరోగ్య సంరక్షణ అందించాలనే మా లక్ష్యంలో ఇది ఒక ముఖ్యమైన అడుగు అని మేము నమ్ముతున్నాము” అని అన్నారు.

లార్డ్స్ మార్క్ ఇండస్ట్రీస్ తమ సాంకేతిక భాగస్వామి డోజీ సహకారంతో అభివృద్ధి చేసిన E స్మార్ట్ క్లినిక్, ఎటువంటి బాహ్య జోడింపులు లేకుండా రోగుల, ముఖ్యమైన ఆరోగ్య లక్షణాలను గుర్తించడానికి పేటెంట్ సాంకేతికతను ఉపయోగించుకుంటుంది. కేవలం 20 నిమిషాల్లో రక్తపరీక్షలు నిర్వహించగల సామర్థ్యం ఉన్న ఈ క్లినిక్ గ్రామీణ రోగులను ఆన్‌లైన్‌లో అగ్రశ్రేణి వైద్యులతో అనుసంధానం చేస్తుంది.

IIT ఢిల్లీలోని ఫౌండేషన్ ఫర్ ఇన్నోవేషన్ & టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్‌లో నేషనల్ కోఆర్డినేటర్ విజేంద్ర కుమార్ విజయ్, ఈ భాగస్వామ్యం గురించి మాట్లాడుతూ.. “లార్డ్స్ మార్క్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఉన్నత్ భారత్ అభియాన్, FIIT మధ్య సహకారం హెల్త్‌కేర్ యాక్సెస్‌ను ప్రజాస్వామ్యీకరించాలనే సామూహిక లక్ష్యం లో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. సమీప భవిష్యత్తులో భారతదేశ వైద్య మౌలిక సదుపాయాలపై పరివర్తనాత్మక ప్రభావాన్ని నేను అంచనా వేస్తున్నాను” అని అన్నారు. తొలుత ఐదు కేంద్రాలలో విజయవంతమైన ట్రయల్స్ తర్వాత, E స్మార్ట్ క్లినిక్ భారతదేశం అంతటా అందుబాటులోకి వస్తుంది. లార్డ్స్ మార్క్ ఇండస్ట్రీస్ ఈ క్లినిక్‌ను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది, పరీక్ష, కన్సల్టేషన్ ఫీజు ఒక రోగికి రూ.1000 కంటే తక్కువలో అందించనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News