Wednesday, May 15, 2024

అందరికీ నచ్చేలా సినిమా

- Advertisement -
- Advertisement -

సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కె.దశరధ్ నిర్మాతగా వ్యవహరిస్తూ కథ అందించిన చిత్రం ‘లవ్ యు రామ్’. ఈ చిత్రానికి డివై చౌదరి దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. రోహిత్ బెహల్, అపర్ణ జనార్దనన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా టీజర్ కి మంచి స్పందన వచ్చింది.  హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ లాంచ్ చేశారు. ఈ ఈవెంట్‌లో కె.దశరధ్ మాట్లాడుతూ “ఈనెల 30న లవ్ యూ రామ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. మైత్రీ మూవీస్ వారి ద్వారా విడుదల చేస్తున్నాం.

ఈ సినిమా చాలా మంచి ఎంటర్‌టైనర్. మ్యూజిక్, కథ అన్నీ బావుంటాయి” అని అన్నారు. డివై చౌదరి మాట్లాడుతూ “అందరికీ నచ్చేలా సినిమా వచ్చింది. ఇప్పటివరకూ చూసిన వారందరూ హ్యాపీగా ఫీలయ్యారు. పాటలకు మంచి స్పందన వచ్చింది”అని తెలిపారు. హీరో రోహిత్ మాట్లాడుతూ “ఈ సినిమా నుంచి చాలా నేర్చుకున్నాను. నాకు ఇది చాలా గ్రేట్ జర్నీ”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ అపర్ణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News