Tuesday, May 30, 2023

నిజామాబాద్ లో ప్రేమజంట ఆత్మహత్య….

- Advertisement -
- Advertisement -

Lovers commit suicide in Nizamabad

నిజామాబాద్: ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన నిజామాబాద్ జిల్లా చందూరు మండలం లక్ష్మీపూర్ లో  గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మోస్రా మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన మోహన్, లక్ష్మీ అనే యువతి, యువకుడు గత కొన్ని రోజుల నుంచి ప్రేమించుకుంటున్నారు. లక్ష్మీపూర్ అటవీ ప్రాంతంలో ఇద్దరు ఉరేసుకున్నారు. గొర్రెల కాపాలదారులు మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.  పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించారు. మృతదేహాలు కుళ్లిపోయాయని పోలీసులు తెలపారు. ఇద్దరు వారం రోజుల కిందటే ఆత్మహత్య చేసుకొని ఉంటారని భావిస్తున్నారు. ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News