Sunday, April 28, 2024

మా పోలీసుకు రెస్టు కావాలి

- Advertisement -
- Advertisement -

Police assistance

 

కేంద్ర బలగాల సాయం కోరిన మహారాష్ట్ర

లక్నో : పోలీసు సాయం కోసం మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. తొలి లాక్‌డౌన్‌కు ముందు మూడు రోజుల నుంచి తమ రాష్ట్ర పోలీసులు విధులలో ఉన్న విషయాన్ని తెలిపారు. రెండు నెలలుగా కరోనా సమయంలో విధులలో ఉన్న వీరికి సరైన విశ్రాంతి కల్పించాల్సి ఉందని కేంద్రానికి మహారాష్ట్ర ప్రభుత్వం తెలియచేసుకుంది. కనీసం రెండువేల మంది కేంద్రీయ పోలీసులను రాష్ట్రానికి పంపించాలని కోరినట్లు రాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ బుధవారం విలేకరులకు తెలిపారు. కరోనా మహమ్మారితో విధించిన లాక్‌డౌన్‌ను అమలుపర్చేందుకు తమ పోలీసు బలగాలు రాత్రింబవళ్లూ ఆఫ్‌లు సెలవులు లేకుండా పనిచేస్తున్నాయని, వీరికి దశలవారిగా విశ్రాంతి కల్పించాల్సి ఉందని దేశ్‌ముఖ్ తెలిపారు. దేశంలో అన్ని రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్రలోనే కరోనా పెను ప్రభావాన్ని చూపింది. మృతుల సంఖ్య పెరుగుతూ పోతోంది.

అత్యధిక సంఖ్యలో కరోనా రోగులు ఉన్నారు. ముంబైలోని మురికివాడలలో కరోనా తీవ్రత అనేక రకాలుగా ఇక్కట్లను మిగిల్చింది. త్వరలోనే రంజాన్ ఈద్ కూడా రానుందని, శాంతిభద్రతల పరిరక్షణ కూడా ముఖ్యమని, ఇప్పటికే అలసిపోయి ఉన్న రాష్ట్ర పోలీసు బలగాలు అదనపు ఒత్తిడిని తట్టుకోవడం కష్టమని హోం మంత్రి తెలిపారు. అందుకే 20 కంపెనీలు లేదా రెండు వేల మంది కేంద్రీయ పోలీసు బలగాలను రాష్ట్రానికి తరలించాలని కోరినట్లు మంత్రి వివరించారు. కేంద్ర పోలీసు బలగాల కోసం కేంద్రాన్ని కోరనున్నట్లు అంతకు ముందు ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సంకేతాలు ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News