Tuesday, May 7, 2024

రానున్న 3 రోజుల్లో ఉరుములతో కూడిన వర్షం..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో రాగల 3 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, ఆ ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న అండమాన్ సముద్రం ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది సుమారుగా 15వ తేదీన దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఇది మరింత బలపడి నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతం మధ్య ప్రాంతాల్లో మే 16 సాయంత్రానికి తుపానుగా మారే అవకాశం ఉందని ప్రకటించింది. ప్రారంభంలో 17వ తేదీ వరకు వాయువ్య దిశగా ప్రయాణించి, తరువాత ఈశాన్య దిశగా వెళ్లే అవకాశం ఉందని పేర్కొంది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయంది. అక్కడక్కడ 40 నుంచి 43 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.

Rains in Next 3 days in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News