Friday, May 3, 2024

బ్యానర్ ఇచ్చితిరి… మ్యాటర్ మరిచితిరి

- Advertisement -
- Advertisement -

Chidambaram

 

ప్రధాని ప్యాకేజీపై చిదంబరం విసుర్లు

న్యూఢిల్లీ : మన దేశ ప్రధాని పత్రికలకు పతాక శీర్షికను ఇచ్చి, ఖాళీ పేజీని మిగిల్చారని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత చిదంబరం చురకలు పెట్టారు.

రూ 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటనపై చిదంబరం బుధవారం స్పందించారు. పత్రికలకు హెడ్డింగ్ దొరికింది కానీ నింపడానికి వార్త లేదని వ్యాఖ్యానించారు. ప్యాకేజీని ప్రకటించిన ప్రధాని , ఖాళీ పేజీ నింపే బాధ్యతను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అప్పగించినట్లుగా ఉందన్నారు. కరోనా లాక్‌డౌన్‌తో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవానికి ప్రధాని మోడీ భారీ స్థాయి ప్యాకేజీని అందుబాటులోకి తెస్తున్నట్లు మంగళవారం తెలిపారు. వివరాలను ఆర్థిక మంత్రి తెలియచేస్తారని ప్రకటించారు. హెడ్డింగ్ ప్రధానిది, వార్త నింపే పనిని నిర్మలకు అప్పగించినట్లు ఉందన్నారు. ప్యాకేజీ ప్రకటించారు సరే ప్రజలకు ఏమి అందిస్తారనేది ఇక తేలుతుందని అన్నారు. డస్సిపోయిన ఆర్థిక పరిస్థితికి కేంద్రం పంపించే ప్రతి ఒక్క అదనపు రూపాయీని తాను లెక్కకడుతానని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అయిన చిదంబరం స్పష్టం చేశారు.

పేదలు, ఆకలితో ఉన్న వారు, వందలాది కిలోమీటర్లు కాలినడకన ఇళ్లకు చేరుకున్న ఛిన్నాభిన్నమై ఉన్న వలసకూలీలు ఇప్పుడు కేంద్రం నుంచి ఏమి పొందుతారనే చిట్టా విప్పుతానని ప్రకటించారు. ఎవరికి ఎంత అందుతుందనేది తాము అత్యంత నిశితంగా పరిశీలిస్తామని స్పష్టం చేశారు. అత్యంత నిరుపేదలైన 13 కోట్ల కుటుంబాల వారికి నికరమైన డబ్బు ఎంత అందుతుందనేది తేలాల్సి ఉందని తెలిపారు. ప్రధాని ప్యాకేజీపై మరో కాంగ్రెస్ నేత జైరాం రమేష్ కూడా స్పందించారు. ప్రధాని గొప్పగా చెప్పారు కానీ , ఇందులో సారం ఏదీ లేదన్నారు. ఇది మాగ్జిమం ప్యాకేజింగ్, మినిమం మీనింగ్ బాపతుగా ఉందన్నారు. ఇది నిజంగానే నమోకు ప్రతీక అన్నారు. ఈ నమోను నో యాక్షన్ ..మిస్సేజ్ ఓన్లీగా చూడవచ్చునని తెలిపారు. ఈ విధంగా నమోకు ఈ ప్యాకేజీ బాగా అతికిపోయిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News