Wednesday, May 8, 2024

ప్రయాణికులతో సందడిగా మారిన మహాత్మాగాంధీ బస్టేషన్

- Advertisement -
- Advertisement -

Mahatma Gandhi bus station bustling with Travelers

 

మన తెలంగాణ, హైదరాబాద్ : కరోనా ప్రభావంతో ప్రభుత్వం లాక్‌డౌన్ విధించడంతో సుమారు రెండు నెలలు బోసిపోయిన మహాత్మాగాంధీ బస్టేషన్ ప్రభుత్వం నిబంధనలు సడలించడంతో బస్సుల హరన్ మోతలు, ప్రయాణికుల రాకపోకలతో సందడిగా మారింది. లాక్‌డౌన్ నిబంధనల్లో భాగంగా అంతరాష్ట్ర బస్సుసర్వీసులకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం బస్సులను బస్టాండ్‌లోకి అనుమతించలేదు. వాటిని శివారు ప్రాంతాలైన హయత్‌నగర్, ఉప్పల్, ఆరాంఘర్ చౌరస్తాల వరకు మాత్రమే పరిమితం చేసింది. దాంతో ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఆటోలను ,క్యాబ్‌లను ఆశ్రయించి శివారు ప్రాంతాలకు చేరుకునే సరికి వారు ప్రయాణికుల వద్ద నుంచి బస్సుచార్జీలకు మూడింతలు వసూలు చేసేవారు. అయితే నిబంధనల సడిలింపులో భాగంగా బుధవారం జరిగిన సమీక్షా సమావేశంలో బస్సులను బస్డాండ్‌లలోకి అనుమతించడమే కాకుండా రాత్రి పూట కూడా బస్సులు తిరిగేందుకు ప్రభుత్వం నిబంధనల్లో సడలింపు ఇచ్చింది.

హర్షం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు

నిబంధనల్లో సడలింపులో బాగంగా బస్సులను బస్టేషన్‌కు అనుమతించడం, రాత్రి పూట కూడా బస్సులను తిరిగేందుకు అనుమతించడంతో పాటు ఆటోలు, క్యాబ్‌లకు నిబంధనల నుంచి మినహయింపు ఇవ్వడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శివారు ప్రాంతాలకు వెళ్ళి బస్సులు ఎక్కాలన్నా, అక్కడ నుంచి తిరిగి సిటీలో గమ్యస్థానాలకు చేరుకోవాలన్నా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే వారమని అంతే కాకుండా ఆటోలు,క్యాబ్‌లు కూడా పెద్ద ఎత్తున చార్జీలు వసూలు చేసేవని తెలిపారు.అంతే కాకుండా వేసవిలో పదిగంటల నుంచి ఎండలు మండిపోతున్నాయని. దాంతో పాటు రాత్రి 7 దాటితో బస్సులు తిరగక పోవడంతో ప్రయాణాలు వాయిదా వేసుకున్నామని తెలిపారు. ప్రస్తుతం నిబంధనల సడలింపుల్లో భాగంగా రాత్రి సమయంలో కూడా బస్సులు తిరిగేందుకు అనుమతి ఇవ్వడంతో వేసవి తీవ్రతను తట్టుకునేందుకు తాము రాత్రి ప్రయాణాలకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News