Wednesday, May 8, 2024

తమిళ్ హిట్ డైరెక్టర్‌తో మూవీ

- Advertisement -
- Advertisement -

ఈమధ్య కాలంలో తమిళంలో భారీ వసూళ్లను సాధించిన చిత్రంగా ‘మాస్టర్’ నిలిచింది. స్టార్‌హీరో విజయ్ పేరుతో అంతకుముందున్న రికార్డులను ఈ సినిమా చెరిపేసింది. ఇలాంటి బ్లాక్‌బస్టర్ మూవీని అందించిన దర్శకుడు లోకేశ్ కనగరాజ్ స్క్రీన్‌ప్లే ప్రతిభకు మెచ్చిన కమల్ తన బ్యానర్‌పై ఒక ఛాన్స్ ఇచ్చాడు. ‘విక్రమ్’ టైటిల్‌తో ఈ సినిమా రూపొందుతోంది. అలాంటి లోకేశ్ .. కమల్ తరువాత సినిమాను ఏ హీరోతో చేయనున్నాడనేది ఆసక్తికరంగా మారింది. అయితే లోకేశ్ తన డిమాండ్ కి తగినట్టుగానే స్టార్ హీరోల వైపు తన కథలను మళ్లిస్తున్నాడు. తమిళంలో రజనీకాంత్ కోసం ఒక కథను రెడీ చేసుకుంటున్న ఆయన తెలుగులో మహేశ్ బాబు కోసం మరో కథను సిద్ధం చేస్తున్నాడని అంటున్నారు.’మాస్టర్’ సినిమాతో హీరో విజయ్‌తో లోకేశ్ కి మంచి సాన్నిహిత్యం ఏర్పడింది.

అందువల్లనే లోకేశ్ ఆయనతో మహేశ్ బాబుకి కాల్ చేయించాడనే ఒక టాక్ వినిపిస్తోంది. హీరో విజయ్‌కి, మహేశ్ బాబుకి మధ్య మంచి స్నేహం ఉంది. ఒకరి సినిమా చూసి ఒకరు తరచూ ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉంటారు. అందువలన లోకేశ్ సిద్ధం చేస్తున్న కథను వినమని మహేశ్ బాబుతో విజయ్ చెప్పాడనే వార్త చక్కర్లు కొడుతోంది. అపాయింట్ మెంట్ ఇవ్వడానికి మహేశ్ బాబు అంగీకరించాడని అంటున్నారు. గతంలో మురుగదాస్‌కి ఛాన్స్ ఇచ్చిన మహేశ్ బాబు ఈసారి లోకేశ్‌కి అవకాశం ఇస్తాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సమయం పడుతుందేమోగానీ కాంబినేషన్ సెట్ కావడం మాత్రం ఖాయమేనని చెప్పుకుంటున్నారు.

Mahesh babu to work with tamil director Lokesh?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News